గుడివాడ నియోజకవర్గం పసుపుకోట..టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ పసుపు జెండా ఎగురుతుంది. ఏకంగా ఎన్టీఆర్ సైతం గెలిచిన గడ్డ..అలాంటి నియోజకవర్గంలో కొడాలి నాని వల్ల టిడిపి వెనుకబడింది. కానీ అదే కొడాలి టిడిపి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు..చంద్రబాబు సీటు ఇస్తే రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అప్పటికే గుడివాడలో టిడిపికి అండగా ఉన్న రావి ఫ్యామిలీని కాదని, నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న కొడాలికి 2004లో సీటు ఇచ్చారు.
అప్పుడు కాంగ్రెస్ గాలి ఉన్నా సరే గుడివాడలో టిడిపి గెలిచింది..2009లో అదే పరిస్తితి. కానీ ఆ తర్వాత కొడాలి జగన్ వైపుకు వెళ్లారు. టిడిపిలో బలాన్ని బలగాన్ని పెంచుకుని వైసీపీలోకి వెళ్ళి 2014లో గెలిచారు. అలాగే 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇలా ఓటమి లేకుండా కొడాలి ముందుకెళుతున్నారు. అయితే కొడాలి గెలిచిన అధికారంలో ఉండటం లేదని, అందుకే ఏం చేయలేకపోతున్నారని ప్రజలు గెలిపించుకుంటూ వచ్చారు. కానీ 2019లో అధికారం వచ్చింది..మంత్రి కూడా అయ్యారు. మరి గుడివాడకు ఒరిగింది ఏమి లేదు..అభివృద్ధి లేదు..రోడ్లు దారుణంగా ఉన్నాయి. అన్నిటికంటే గుడివాడలో ఎప్పుడూలేని విధంగా అరాచకాలు, రౌడీయిజం, దాడులు పెరిగాయి.

ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు..సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చాలా ఏళ్ల తర్వాత గుడివాడలో ఎంట్రీ ఇచ్చారు..ఇక బాబుకు గుడివాడ ప్రజలు నీరాజనం పలికారు. పెద్ద ఎత్తున మద్ధతు ఇచ్చారు. గుడివాడ పసుపుమయం అయింది.
ఈ దెబ్బతో గుడివాడలో టీడీపీ గాలి మొదలైందని తెలుస్తోంది. ఇక బలమైన అభ్యర్ధిని దింపితే..కొడాలి నానిని ఓడించడమే మిగిలి ఉంది. మొత్తానికి ఇప్పుడు గుడివాడలో కొడాలి తొలి పరాజయం దిశగా ముందుకెళుతున్నారు.