ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని అంటే టీడీపీ శ్రేణులకు ఎంత కోపమో చెప్పాల్సిన పని లేదు..అసలు ఆయన పేరు చెబితేనే తెలుగు తమ్ముళ్ళు రగిలిపోయే పరిస్తితి ఉంది..ఇలా ఎందుకు తమ్ముళ్ళు రగిలిపోతారో అందరికీ తెలిసిందే..ఎందుకంటే కొడాలి నాని..చంద్రబాబు-లోకేష్‌లపై ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తారో చెప్పాల్సిన పని లేదు..విమర్శలు అనడం కంటే బూతులు తిడతారని చెప్పొచ్చు..అలా తిడతారు కాబట్టే కొడాలి అంటే తమ్ముళ్ళకు కోపం. ఇక ఆ కోపాన్ని ఎన్నికల్లో కొడాలిని ఓడించడానికి ఉపయోగించాలని తమ్ముళ్ళు ఎదురుచూస్తున్నారు.

ఈ సారి ఎలాగైనా గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టాలని తమ్ముళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు… ముఖ్యంగా సోషల్ మీడియాలో నాని టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం చేస్తారో అందరికీ తెలిసిందే…ఆయనపై పూర్తిగా నెగిటివ్ ప్రచారం చేస్తారు..ఆ నెగిటివ్ ప్రచారానికి తగ్గట్టుగానే గుడివాడలో కూడా నానికి ఈ సారి పూర్తిగా పాజిటివ్ ఉన్నట్లు కనిపించడం లేదు…గత ఎన్నికల మాదిరిగా..ఈ ఎన్నికల్లో కొడాలికి పూర్తి సపోర్ట్ మాత్రం దక్కేలా లేదు..ఈ సారి కొందరు ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.

కొడాలి వైఖరి గురించి కావొచ్చు…ఇక ఆయన మంత్రి అయిన సరే గుడివాడలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం కావొచ్చు..కొన్ని పరిణామాలు నానికి మైనస్ గా కైపిస్తున్నాయి. అలా అని నెగిటివ్ ఉందని చెప్పి కొడాలిని ఓడించడం అంత ఈజీ కాదనే చెప్పాలి..పైగా కొడాలి ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు పెద్దగా పనిచేయడం లేదు…అసలు గుడివాడలో ఆయన టీడీపీని బలపర్చే మార్గాలు మాత్రం చూడటం లేదు.

ఏదో అప్పుడప్పుడు కనిపించడం తప్ప..నియోజకవర్గం మొత్తం తిరిగి, ప్రజలకు దగ్గర అవ్వాలనే ఆలోచన చేయడం లేదు. దీని వల్ల గుడివాడలో టీడీపీ ఇంకా బలపడని పరిస్తితి…అయితే కొడాలి ఇలా ఉండటానికి కారణాలు లేకపోలేదు..ఆయనకు నెక్స్ట్ సీటు వస్తుందో లేదో క్లారిటీ లేదు…వచ్చిన గెలుస్తామో లేదో క్లారిటీ లేదు..అందుకే ఏ రావి వెంకటేశ్వరరావు సైలెంట్‌గానే ఉండిపోతున్నారు..అలాగే గుడివాడలో తెలుగుదేశం పార్టీ కూడా బలపడలేకపోతుంది.

Discussion about this post