గుడివాడ రాజకీయ యుద్ధం రోజురోజుకూ ముదురుతుంది. వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య రగడ తారస్థాయికి చేరుకుంటుంది. మొన్నటివరకు అధికార బలంతో వైసీపీ పూర్తిగా డామినేట్ చేసింది..కానీ ఇటీవల టీడీపీ వైసీపీకి ధీటుగా ముందుకెళుతుంది. టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు దూకుడుగా పనిచేస్తున్నారు. దీంతో గుడివాడలో టీడీపీ శ్రేణులు ఫుల్ గా యాక్టివ్ అయ్యాయి. ఎలాగైనా నెక్స్ట్ కొడాలి నానిని ఓడించాలనే కసితో పనిచేస్తున్నాయి.

అయితే టీడీపీ బలం పెరుగుతుండటంతో టీడీపీకి బ్రేక్ వేసేందుకు వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. పైగా అధికార బలంతో టీడీపీని దెబ్బకొట్టడానికి చూస్తుంది. కాకపోతే వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. తాజాగా గుడివాడలో పెద్ద రచ్చ జరిగింది. డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం చేయడానికి టీడీపీ సిద్ధమైంది. రావి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయాలని చూశారు. కానీ ఈ కార్యక్రమం చేయవద్దని కొడాలి నాని అనుచరుడు కాళీ..రావికి వార్నింగ్ ఇచ్చారు.

దీంతో రావి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపే కొడాలి నాని అనుచరులు గుడివాడలోని టీడీపీ ఆఫీసుకు వచ్చి పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారు. టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా ప్రతిఘటించడంతో..రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ లోపు పోలీసులు రెండు వర్గాలని చెదరగొట్టారు. కానీ టీడీపీ శ్రేణులపైనే లాఠీ చార్జ్ చేశారు.

అయితే రంగా వర్ధంతి కార్యక్రమం చేస్తే కాపు ఓట్లు టీడీపీకి అడ్వాంటేజ్ అవుతాయనే ఉద్దేశంతో రావిని అడ్డుకునే ప్రయత్నం చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కానీ ఈ పని చేయడం వల్ల వైసీపీకి పెద్ద నష్టం అవుతుందని, ఆల్రెడీ పవన్‌ని టార్గెట్ చేయడం వల్ల గుడివాడలో కాపులు యాంటీగా ఉన్నారు..ఇప్పుడు ఆ పరిస్తితి ఎక్కువగా ఉందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ కాపు అస్త్రం రివర్స్ అయిందని చెప్పవచ్చు.
