గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న టిడిపి శ్రేణులు ఇంకా దూకుడు కనబర్చడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కంచుకోటని రెండు సార్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం కంచుకోటని తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా టిడిపి శ్రేణులు ముందుకెళుతున్నాయి. అసలు గుడివాడలో మంత్రి కొడాలి నాని హవా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. గత రెండు పర్యాయాలు…ఈయన వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. పైగా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. దీంతో గుడివాడలో నానికి ఎదురులేకుండాపోయింది.

ఇదే సమయంలో గుడివాడ టిడిపి ఇంచార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు సైలెంట్ అయ్యారు. నాని అధికారంలో ఉండటంతో ఏమన్నా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సైలెంట్ అయ్యారు. అయితే నాని వల్ల గుడివాడకు ఒరిగినది ఏమి లేదు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధికారంలో లేరు కాబట్టి ఏం చేయట్లేదని ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా నాని చేసేది ఏమి లేదని గుడివాడ ప్రజలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం…రోడ్ల పరిస్తితి దారుణంగా ఉంది. ఏదో పథకాలు మాత్రం అందుతున్నాయి.

అంటే నాని మంత్రి అయినా కూడా గుడివాడకి ఒరిగింది ఏమి లేదు. దీంతో టిడిపి పోరాటాలకు రెడీ అవుతుంది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు టిడిపి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక పోరాటాలకు సిద్ధమవుతున్న గుడివాడ టిడిపి శ్రేణుల్లో…యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కొత్త జోష్ నింపారు. తాజాగా గుడివాడ నియోజకవర్గం ఇచ్చి, మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు.

బూతులు మాట్లాడటం తప్ప నాని చేసేది ఏమి లేదని, టిడిపి కార్యకర్తలు మళ్ళీ కష్టపడి చంద్రబాబుని గెలిపించుకోవాల్సిన అవసరముందని అన్నారు. అయితే రామ్మోహన్ ఎంట్రీతో ఎన్టీఆర్ కంచుకోట అయిన గుడివాడలో టిడిపి శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంతకాలం నానికి భయపడిన వారు…నిదానంగా బయటకొచ్చి టిడిపిని పైకి లేపడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి రామ్మోహన్ ఎంట్రీతో గుడివాడ టిడిపికి కొత్త ఊపు వచ్చిందని చెప్పొచ్చు.

Discussion about this post