ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలే కాదు..మంత్రుల గ్రాఫ్ కూడా అనూహ్యంగా పడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ అంతర్గత సర్వేల్లోనే వారి పనితీరుపై సర్వేలు వస్తున్నాయి. వాటిల్లో పలువురు పనితీరు బాగోలేదని తెలుస్తోంది. అలాంటి వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే మంత్రుల విషయంలో కూడా జగన్ క్లాస్ ఇస్తున్నారు.
వైసీపీ అంతర్గత సర్వేల ప్రకారమే..దాదాపు 15 మంది మంత్రుల పనితీరు సరిగ్గా లేదని తెలుస్తోంది. వారికి గెలుపు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల పనితీరు కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు కూడా ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నట్లు సమాచారం. గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజిని, మేరుగు నాగార్జున మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.

వీరిలో బాగా వ్యతిరేకతని ఎదురుకుంటున్న మంత్రి అంబటి రాంబాబు..ఈయన మీడియా ముందుకొచ్చి చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం తప్ప..శాఖ పరంగా చేసేదేమీ లేదు. అటు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. కాకపోతే ఇక్కడ టిడిపిలో అంతర్గత పోరు ఉండటం అంబటికి ప్లస్. అదే సమయంలో టిడిపి-జనసేన కలిస్తే అంబటికి చెక్ పడుతుంది.
అటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన విడదల రజిని..మంత్రిగా చేసేదేమీ కనిపించడం లేదు..పబ్లిసిటీ తప్ప..ప్రజలకు సేవ చేస్తున్నట్లు లేరు. చిలకలూరిపేటలో ఆమెకు పాజిటివ్ కనిపించడం లేదు. ఇక మేరుగు నాగార్జున..ఈయన మంత్రి అనే సంగతి చాలమందికి తెలియదు. ఇంకా ఈయన ఏ శాఖ మంత్రి అనేది ప్రజలకు తెలియదు. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరులో నాగార్జునపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కాబట్టి గుంటూరులో ముగ్గురు మంత్రులు మళ్ళీ గెలిచి బయటపడేలా లేరు.