మొదట నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే..ఏ రాజకీయ పార్టీ అయినా కమ్మ నేతల హవానే ఎక్కువ ఉంటుంది..ముఖ్యంగా గుంటూరు జిల్లాలో టీడీపీని నడిపించేది కమ్మ నేతలే…దాదాపు 8 నియోజకవర్గాల్లో కమ్మ నేతలు టీడీపీని నడిపిస్తున్నారు. అయితే వీరంతా నెక్స్ట్ ఎన్నికల్లో విజయం సాధించాలనే కసితో పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో టీడీపీ కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు.

ఇక ఆ ఓటమి నుంచి తేరుకుని ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకుని, వైసీపీకి ధీటుగా కమ్మ నేతలు ఎదిగారు…పైగా వైసీపీపై వ్యతిరేకత పెరగడం, అమరావతికి వ్యతిరేకంగా ఉండటం టీడీపీకి కలిసొస్తుంది. అందుకే ఎక్కడకక్కడ టీడీపీ కమ్మ నేతలు పుంజుకున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో నారా లోకేష్ ఈ సారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నారు.గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆళ్ళపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది…నెక్స్ట్ ఆయన గెలుపు కష్టమయ్యేలా ఉంది. ఇక వరుసగా అయిదుసార్లు గెలిచి…డబుల్ హ్యాట్రిక్ కొట్టాలసిన ధూళిపాళ్ళ నరేంద్ర…పొన్నూరు బరిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు పొన్నూరులో నరేంద్ర ఓ రేంజ్ లో పికప్ అయ్యారు…నెక్స్ట్ ఆయన విజయాన్ని ఆపడం కష్టమే. అటు చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకు పాజిటివ్ ఉంది…ఈ సారి పేటలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పొచ్చు.

అలాగే వినుకొండలో జీవీ ఆంజనేయులు దూకుడుగా పనిచేస్తున్నారు…ఇప్పటికే అక్కడ టీడీపీ ఎడ్జ్ లోకి వచ్చింది. ఇంకొంచెం కష్టపడితే వినుకొండ టీడీపీ వశమే. అటు పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ సైతం పికప్ అవుతున్నారు. ఇక గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…నెక్స్ట్ గురజాల టీడీపీ వశం అయ్యే వరకు యరపతినేని వదిలేలా లేరు. సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ సీట్లు ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది…ఇవి కూడా కమ్మ నేతలకే దక్కేలా ఉన్నాయి. మొత్తానికి గుంటూరులో కమ్మ నేతలు లీడ్ లోకి వచ్చారు.
Discussion about this post