ఉమ్మడి గుంటూరులో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదనే వాదన వినిపి స్తోంది. ఎంపీ కేంద్రంగా జరుగుతున్న ఈ వివాదం.. పార్టీలో కాకరేపుతోంది. పైకి మాత్రం అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. లోలోన మాత్రం మేడిపండు చందంగా నాయకులకు పడడం లేదని సమాచారం. మంగళగిరి నియోజకవర్గంలో రెండు కూటములు ఏర్పడ్డాయని అంటున్నారు. వీరిలో ఒకరు లోకేష్‌కు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరో వర్గం మౌనంగా ఉంటోంది.

ఇటవల లోకేష్.. ఇక్కడ పర్యటించినప్పుడు కూడా.. ఈ వ్యతిరేక వర్గం.. బయటకు రాలేదు. దీనికి కార ణం.. గత ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ లాగేసుకున్న తమ నాయకుడికి.. కనీస గౌరవం కూడా దక్కడం లేదని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో.. ఎంపీ అసలు ఎక్కడా కనిపించడం లేదని టీడీపీ నాయకులే అంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాము.. ఎంతో ఆయనకు పనిచేశామని.. ఇప్పుడు కనీసం కనిపించడం లేదని చెబుతున్నారు.

ఇక, రాజధాని సమీపంలోని ఒక నియోజకవర్గంలో జరుగుతున్న వైసీపీ అంతర్గత రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో… టీడీపీ నాయకులకు విఫలమవుతున్నారని. మరోవాదన వినిపిస్తోంది. ఇక్కడ కూడా.. వైసీపీలోకి వెళ్లిన ఓ నేత కనుసన్నల్లో.. ఒక టీడీపీ వర్గం పనిచేస్తోందని.. అంటున్నారు. వాస్తవానికి ఇదిచాలా చిత్రంగా అనిపించినా.. నిజమేనని చెబుతున్నారు. సదరు నాయకుడు.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారట.

మరోవైపు.. నాయకుల మధ్యకూడా ఆధిపత్య ధోరణి పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో గుంటూరులో జరుగుతున్న అంతర్గత వివాదాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. చెబుతు న్నారు పరిశీలకులు. మరి దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో.. ఏం చేస్తారో చూడాలి. బలమైన కంచుకోటలో టీడీపీ వివాదాలు.. టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోతాయని.. పలువురు వ్యాఖ్యానిం చారు. ‘

Discussion about this post