నెక్స్ట్ ఎన్నికల్లో 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీట్లు ఇచ్చే సాహసం చేయరనే చెప్పాలి. తనని పక్కన పెడితే 150 మందికి సీట్లు ఇస్తే..వైసీపీకి భారీ డ్యామేజ్ జరగడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం జగన్‌కు కూడా క్లారిటీ ఉంది. పార్టీ అంతర్గత సర్వేల్లోనే దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది.

అలా అని వారికి సీట్లు ఇవ్వకుండా ఉన్నా అదొక తలనొప్పి..అందుకే కొందరికి సీట్లు ఇవ్వకుండా వేరే పదవులు ఆఫర్ చేయడంతో పాటు కొందరిని నియోజకవర్గాలు మార్చాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి ఎక్కువ నెగిటివ్ కనిపిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరికి సీట్లు ఇవ్వకపోవడం పక్కన పెడితే..కొందరి సీట్లు మారుస్తారనే ప్రచారం ఉంది. గుంటూరు ఈస్ట్ సీటులో ఎమ్మెల్యే ముస్తఫా బదులు ఆమె కుమార్తె పోటీ చేస్తారని టాక్.

ఇక మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వ్యతిరేకత ఎక్కువ ఉంది. అలా అని ఆయనకు సీటు ఇవ్వకపోవడం బాగోదు…అందుకే ఆయన్ని సత్తెనపల్లికి పంపుతారని తెలుస్తోంది. అక్కడ సత్తెనపల్లిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబుని రేపల్లె లేదా అవనిగడ్డకు పంపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇటు తాడికొండ సీటు ఎమ్మెల్యే శ్రీదేవికి దక్కే అవకాశాలు ఏ మాత్రం లేవు.


అలాగే వినుకొండ, పొన్నూరు ఎమ్మెల్యేలకు ఇంకా సీట్ల విషయం క్లారిటీ లేదు. ఇలా గుంటూరు లో పలు సీట్లు మాత్రం మారడం ఖాయమని తెలుస్తోంది.

Leave feedback about this