గుంటూరు జిల్లా అంటే కమ్మ సామాజికవర్గానికి పట్టు ఉన్న జిల్లా అని చెప్పొచ్చు. ఇక్కడ మెజారిటీ నియోజకవర్గాల్లో కమ్మ నేతలదే హవా ఎక్కువ. మొదట నుంచి కమ్మ నేతల డామినేషన్ కొనసాగుతూనే వస్తుంది. ముఖ్యంగా టీడీపీలో కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సగం నియోజకవర్గాలు ఆ కమ్మ నేతల చేతుల్లోనే ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో జగన్ గాలిలో టీడీపీలో ఉన్న కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు.

మరి అలా ఓడిపోయిన కమ్మ నేతలు ఈ రెండున్నర ఏళ్లలో బాగానే పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు. రాజధాని అమరావతి ప్రభావం కావొచ్చు…పలు నియోజకవర్గాల్లో కమ్మ నేతలు లీడ్‌లోకి వచ్చారు. మరి ఏ నాయకులు లీడ్‌లోకి వచ్చారు? ఇంకా ఎవరు పికప్ అవ్వాల్సిన అవసరముంది? అని చూసుకుంటే…అసలు గత ఎన్నికల్లో జిల్లాలో 17 సీట్లు ఉంటే 8 చోట్ల కమ్మ నేతలే పోటీకి దిగి ఓటమి పాలయ్యారు.

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండలో జీవీ ఆంజనేయులు, తెనాలిలో ఆలపాటి రాజా, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్, మంగళగిరిలో నారా లోకేష్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావులు ఓటమి పాలయ్యారు. మరి రెండున్నర ఏళ్ల తర్వాత ఏ నాయకుడుకు బాగా పికప్ అయ్యారనే విషయం ఒక్కసారి గమనిస్తే…నారా లోకేష్, ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి, జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజాలు లీడ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది.





ఇక శ్రీధర్, యరపతినేనిలు ఇంకా పికప్ అవ్వాలసిన అవసరముంది. అటు సత్తెనపల్లిలో కోడెల చనిపోవడంతో ఆయన తనయుడు శివరాం బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. శివరాం కూడా ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరముంది. అలాగే గుంటూరు వెస్ట్ బాధ్యతలని సైతం మరో కమ్మ నేత కోవెలమూడి రవీంద్ర చూసుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ పికప్ అవ్వాలి. మొత్తానికైతే గుంటూరులో కమ్మ నేతలు కాస్త లీడ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది.




Discussion about this post