వైసీపీ కీలకంగా భావిస్తున్న జిల్లాల్లో గుంటూరు ఉమ్మడి జిల్లా ఒకటి. ఇక్కడ రాజధాని ఉద్యమం హోరెత్తి న నాటి నుంచి కూడా ఈ జిల్లాలో అసలు.. రాజధాని సెంటిమెంటు లేదంటూ.. వైసీపీ పెద్ద ఎత్తున ప్రచా రం చేసింది. మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకువచ్చినప్పుడు.. గుంటూరు జిల్లాలో ప్రజలు.. తమకు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు చెప్పారంటూ.. గుంటూరు, విజయవాడ నగర కార్పొరేషన్ల కు జరిగిన ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు.

అంటే.. రాజధాని సెంటిమెంటు ఏమాత్రం లేదని చెప్పుకొనేందుకు ఈ రెండు జిల్లాలను కూడా నాయకు లు తీసుకున్నారు. దీనిని బట్టి.. గుంటూరులో.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుని.. పూర్తిగా రాజధాని సెంటిమెంటును లేకుండా చేయాలని.. భావిస్తున్నారు. అయితే.. రాజధాని మాట ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో.. పార్టీ పరాజయం ముంగిటకు చేరింద ని అంటున్నారు. గుంటూరులో గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో మినహా.. అన్ని వైసీపీ దక్కించుకుంది.

గుంటూరు వెస్ట్, రేపల్లెల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు చోట్ల కూడా వైసీపీ ఖాతా తెరిచి మొత్తంగా.. గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకుంది. కానీ, అధిష్టానం ఈ తరహా ఆలోచన చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాజధాని సెంటిమెంటు కంటే కూడా.. నాయకులపై ఏర్పడుతున్న వ్యతిరేకత వైసీపీకి ప్రాణసంకటంగా మారిపోయింది. ఎక్కడికక్కడ చాలా మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతోంది.

దీంతో పెద్దకూరపాడు, వినుకొండ, తాడికొండ, ప్రత్తిపాడు, గురజాల, నరసరావు పేట వంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండకపోవడం .. ఉన్నా కూడా తమ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకోవడం.. వివాదాలకు కేంద్రంగా ఉండడం. అభివృ ద్ది అడుగంటడం.. ఇలా.. అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీకి దాదాపు 8 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post