మరో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ .. జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని.. ముందుగానే.. ఎన్నికలకు వెళ్లినా.. రాజధాని నగరం.. గుంటూరు జిల్లాలో టీడీపీ దూకుడు ప్రదర్శించడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. అందునా.. జిల్లాలో గెలిచే ఫస్ట్ సీటు.. భారీ మెజా రిటీ వచ్చే సీటు కూడా.. వినుకొండేనని అంటున్నారు పరిశీలకులు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ 30 వేల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ దూకుడుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వినుకొండ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టుంది. ఇక్కడ నుంచి 2009, 2014లో వరుస విజయాలు దక్కించుకున్నారు జీవీ ఆంజనేయులు. 2009లో 24 వేల మెజారిటీతోను.. 2014లో 21 వేల ఓట్ల మెజారిటీ తోనూ ఆయన విజయం సాధించారు. అయితే.. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనా యుడుపై ఉన్న సానుభూతితో కావొచ్చు.. లేదా.. జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ లేదా.. వైసీపీ సునామీ కావొచ్చు.. జీవీ ఆంజనేయులు ఓడిపోయారు.ఇక్కడ బొల్లా రెండు సార్లు ఓడిపోయి ఉండడంతో ఆ సానుభూతి ముందు జీవి అభివృద్ధి, ఆయన చేసిన సేవలు పని చేయలేదు. అయితే.. ఈ రెండున్నరేళ్ల కాలంలో జీవీ దూకుడు పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. ఆయన పట్ల ప్రజల్లోనూ చైతన్యం పెరిగింది. ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయ్యి రెండున్నరేళ్లు అయింది. అయితే.. ఈ కాలంలో ఆయన ఇక్కడ సాధించిన ప్రగతి అంటూ.. ఏమీలేదని అంటున్నారు. పైగా.. ప్రభుత్వం అమలు చేసిన.. పేదలకు ఇళ్ల పథకంలో అవినీతి చేశారంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి.

మరోవైపు.. నియోజకవర్గంలో నీటి సమస్య అలానే ఉంది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత పెరుగుతోందని.. వైసీపీలోనే ఒక టాక్ సైలెంట్‌గా నడుస్తుండడం గమనార్హం. ఇక. జీవీ ఆంజనేయులు విషయానికి వస్తే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్ల కాలంలోనే కాకుండా.. అంతకు ముందు.. తర్వాత.. కూడా.. జీవీ నియోజకవర్గం ప్రజలను అన్ని విధాలా ఆదుకున్నారు.తన ఆధ్వర్యంలోని శివశక్వి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా.. స్థానిక పేదలకు అన్ని విధాలా ఆదుకున్నారు. వినుకొండ నియోజకవర్గంలో రెండున్నర దశాబ్దాలుగా ఆయన పార్టీలకు అతీతంగా ఎంతో మంది పేదలకు చేసిన సేవలు ఆయన్ను ఎప్పటకీ వినుకొండలో ప్రత్యేకమైన స్ధానంలో నిలబెట్టాయి. గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. గుర్తించి నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి నీటిని .. ట్యాంకుల ద్వారా.. తీసుకువచ్చి ఓవర్ హెడ్ ట్యాంకులకు ఎక్కించి మరీ ప్రజలకు సరఫరా చేసిన ఘనత.. జీవీకే దక్కుతుంది. ఆ టైంలోనే ఆయనకు వినుకొండ అపర భగీరథుడు అన్న పేరు వచ్చింది.

అదే సమయంలో.. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ.. ఆయన సుపరిచితులు. ఏ చిన్న కుటుంబం.. ఆయన దగ్గరకు వచ్చి.. శుభకార్యానికి పిలిచినా.. ఆదుకునే తత్వంతో వ్యవహరించారు. ఇక, వెనుక బడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక రూపాల్లో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్‌లు ఇచ్చారు. ఇలా.. ఆయన చేసిన.. ప్రస్తుతం చేస్తున్న పనులు స్థానిక ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం నరసారావుపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పల్నాడులో టీడీపీని పటిష్టం చేసేందుకు తన వంతుగా ప్రతి రోజ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోనూ ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి వినుకొండలో జీవీ గెలుపుతో పాటు ఆయనకు గత మెజార్టీలను మించి 30 వేల పై చిలుకు మెజార్టీ వస్తుందన్న అంచనాలు అప్పుడే స్థానికంగా స్టార్ట్ అయ్యాయి.
Discussion about this post