గుంటూరు జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే జిల్లా అని చెప్పొచ్చు. ఏ ఎన్నికల్లోనైనా ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి…కానీ గత ఎన్నికల్లోనే టీడీపీకి భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అయితే ఆ షాక్ నుంచి టీడీపీ ఇప్పుడుప్పుడే కోలుకుంటుంది. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవుతుంది. అయితే అమరావతి ప్రభావం, వైసీపీపై వ్యతిరేకత లాంటి అంశాలు టీడీపీకి బాగా కలిసొస్తున్నాయి.

ఈ క్రమంలోనే టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేని గుంటూరు ఈస్ట్‌లో కూడా పార్టీ పట్టు సాధిస్తుంది. అసలు మొదట నుంచి ఈస్ట్‌లో పార్టీకి పట్టు లేదు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున మహమ్మద్ ముస్తఫా షేక్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014లో 3 వేల మెజారిటీతో గెలిచిన…ముస్తఫా 2019 ఎన్నికల్లో 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.అయితే నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు…వారు వైసీపీకే మద్ధతు ఎక్కువ. అందుకే ఇక్కడ టీడీపీ గెలుపు గగనమైపోతుంది. కానీ ఈ సారి మాత్రం పరిస్తితి మారుతుంది. రెండుసార్లు గెలిచిన ముస్తఫా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కనబడటం లేదు. ఏదో సంక్షేమ పథకాలు మాత్రమ అమలవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో గుంటూరులో మంచిగానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.

కానీ ఇప్పుడు ఆ అభివృద్ధి లేదు. పైగా రాజధాని అమరావతి అంశం వైసీపీకి మైనస్ ఆవుతుంది. అలాగే టీడీపీ తరుపున నజీర్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈ పరిస్తితులని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఈస్ట్‌లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. పైగా టీడీపీ-జనసేనలు గానీ కలిస్తే వైసీపీకి చెక్ పడిపోతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈస్ట్‌లో జనసేనకు 21 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే టీడీపీ-జనసేన కలిస్తే ముస్తఫాకు డేంజర్.
Discussion about this post