అసలు ఏపీ రాజకీయాలు ఎలా ఉంటున్నాయో అర్ధం కాకుండా ఉంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేసిన కరెక్ట్ అనే పరిస్తితి కనిపిస్తోంది. అయితే దానికి జనం మద్ధతు ఉంటుందా? అంటే స్థానిక ఫలితాలని చూస్తే..ఉందన్నట్లే కనిపిస్తోంది. అందుకే అధికార వైసీపీ ఏం చేసిన చెల్లుబాటు అయ్యే పరిస్తితి ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్న విషయం తెలిసిందే. ఇందులో వేరే డౌట్ లేదనే చెప్పొచ్చు. టీడీపీ నేతలు టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం నడుస్తుందో తెలిసిందే. అయితే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారికి టీడీపీ ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో మాస్కుల గురించి అడిగిన డాక్టర్ సుధాకర్ కావొచ్చు…మధ్య మధ్యలో జరిగిన పలు సంఘటనలు కావొచ్చు.

ఇక ఇప్పుడు వైసీపీ నేత..వైసీపీలో ఉన్న పరిస్తితులు గురించి మాట్లాడినా సరే టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ కార్యకర్త…ఇటీవల అసెంబ్లీలో వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులు…భువనేశ్వరి గురించి చేసిన కామెంట్లపై స్పందించారు. అసలు వారు కోవర్టులో లేక వైసీపీ నేతలో అర్ధం కావడం లేదని, వైసీపీని ఇబ్బంది పెట్టడానికి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఇక ప్రశ్నించిన రెండు రోజులకే బాలినేని అనుచరులు…గుప్తాపై దాడి చేశారు. ఈ విషయం అందరికీ తెలిసింది. కానీ ఈ మ్యాటర్‌ని బ్లూ మీడియా డైవర్ట్ చేసే పనిలో పడింది. సుబ్బారావు…కొడాలి, వంశీ, అంబటిలపై దారుణమైన మాటలు మాట్లాడరంటా…అందుకే తన్నులు తిన్నాడని బ్లూ మీడియా చెబుతోంది. పైగా ఇందులో సుబ్బారావు ఆర్యవైశ్య కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి..టీడీపీ కుల రాజకీయం చేస్తుందని అంటుంది. అసలు ఆ విషయం ఎవరికి తెలియదు.

ఎవరో కుల సంఘ నేతలు స్పందించేవరకు..కానీ దీన్ని టీడీపీకి ఆపాదించేందుకు బ్లూ మీడియా బాగా ట్రై చేసింది. అసలు వైసీపీ నేతపై వైసీపీ వాళ్ళు దాడి చేయడం ఏంటి? మధ్యలో టీడీపీని లాగడం ఏంటని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. పైగా ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి టీడీపీ ముద్ర వేయడం బ్లూ మీడియాకు బాగా అలవాటు అయిందని అంటున్నారు.

Discussion about this post