హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బుల్లితెర , వెండి తెరను రాంప్ ఆడించేస్తున్నారు. దీంతో పాటు బాలయ్య సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో కూడా తిరుగులేకుండా ఉన్నారు. ఇప్పటికే బాలయ్య హిందూపురంలో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలిచి అక్కడ హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య డిసైడ్ అయిపోయారు.

ఇక హిందూపురంలో గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాలయ్య కోట్లాది రూపాయలతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశారు. అప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న వెంకయ్య ద్వారా కూడా బాలయ్య కోట్లాది రూపాయలు తీసుకు వచ్చారు. ఐదేళ్లలో హిందూపురం చాలా డవపల్ అయ్యింది. పైగా హంద్రీనీవా నీళ్లు, లేపాక్షి ఉత్సవాలు, పారిశ్రామికంగా అభివృద్ధి బాగా జరిగింది.

ఎప్పుడు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి హిందూపురం అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది. ఇక అక్కడ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌కు మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. ఈ అంతర్గత కుమ్ములాట టీడీపీకి మరోసారి ప్లస్ అవ్వడంతో పాటు బాలయ్య 2024 ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.


ఇక హిందూపురం జనాలు కూడా ఈ గోలతో విసిగిపోయి ఉన్నారు. బాలయ్య ఉన్నప్పుడు నియోజకవర్గం బాగా డవలప్ అయ్యిందని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి బాలయ్య గెలిస్తే తమకు కొంతైనా ఉపయోగం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హిందూపురం జనాల్లో వైసీపీ వద్దే వద్దు.. జై బాలయ్య అంటూ బాలయ్య నినాదం వినిపిస్తోంది.
Discussion about this post