అసలే హిందూపురం టీడీపీ కంచుకోట…ఇంతవరకు అక్కడ టీడీపీకి ఓటమి రాలేదు..మరి అలాంటి చోట బలపడాలంటే చాలా కష్టపడాలి…ముఖ్యంగా ప్రజలని తిప్పుకోవాలి. ప్రజలకు అండగా నిలబడి వారి మద్ధతు పెంచుకోవాలి. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఆ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎవరికి వారు అధికారం చెలాయించాలని చూస్తున్నారు గాని, ప్రజలకు అండగా ఉండాలని చూడటం లేదు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య మాత్రం..ప్రజలకు అండగా ఉంటున్నారు.

వేరే పనుల్లో బిజీగా ఉన్నా సరే హిందూపురంని వదలడం లేదు. ఏదో రకంగా నియోజకవర్గంలో పనులు చేయిస్తున్నారు. ఆఖరికి సొంత డబ్బు సైతం ఖర్చు పెట్టి పనులు చేయిస్తున్నారు. అందుకే హిందూపురంలో బాలయ్య బలం తగ్గడం లేదు. మరి ఇలాంటి పరిస్తితులు ఉన్నప్పుడు వైసీపీ గెలవడానికి చాలా కష్టపడాలి…కానీ వైసీపీ మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రజా బలం సైతం పెంచుకోలేకపోతున్నారు.ప్రజల మద్ధతు పక్కన పెడితే..అసలు సొంత పార్టీ వాళ్ళ మద్ధతే పెంచుకోలేకపోతున్నారు. సొంత నేతలతోనే తగాదా పెట్టుకుంటున్నారు. పైగా ఇక్బాల్ వైఖరి హిందూపురం వైసీపీ నేతలకు నచ్చడం లేదు. ఆయన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇక్బాల్ ఒంటెద్దు పోకడని నిరసిస్తూ…వారు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. పైగా వారు సెపరేట్ గా ప్రెస్ మీట్ పెడితే..అక్కడకు ఇక్బాల్ వచ్చి రచ్చ చేశారు..పైగా ఇక్బాల్ వర్గం ప్రెస్ మీట్ పెట్టిన వారిపై రాళ్ళ దాడి చేశారు.

అసమ్మతి నాయకులైన మునిసిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డిలతో పలువురు నేతలు….ఇక్బాల్ గురించి వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఇక్బాల్ గెలుపుకు సహకరించేలా లేరు…అసలు టీడీపీ కాదు…ముందు సొంత పార్టీ వాళ్లే ఇక్బాల్ ని ఓడించేలా ఉన్నారు. అంటే హిందూపురంలో వైసీపీకి ఫుల్ డ్యామేజ్ జరిగేలా ఉంది.

Discussion about this post