ఏపీకి ప్రత్యేక హోదా అనేది ప్రాణవాయువు లాంటిదనే సంగతి తెలిసిందే..అలాంటి హోదాపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలు ఆడుతూనే ఉంది..అలాగే వారికి తగ్గట్టుగానే ఏపీలో అధికారంలో వైసీపీ సైతం ముందుకెళుతుంది. దీంతో హోదాపై పదే పదే మోసం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్ళు ఇస్తామని అప్పుడు యూపీఏ హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ..ఈ హామీ నెరవేరుస్తారని అంతా అనుకున్నారు..పైగా టీడీపీ కూడా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

అయినా సరే హోదా రాలేదు…పైగా వేరే రాష్ట్రాలకు హోదా ఇవ్వడం లేదు…దానికి సమానంగా ప్యాకేజ్ ఇస్తామని టీడీపీకి, కేంద్రం చెప్పింది….దీంతో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజ్‌కు ఒప్పుకున్నారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ మాత్రం ఒప్పుకోలేదు…హోదా కోసమని తెగ హడావిడి చేసింది…టీడీపీని కేంద్రం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ఇక టీడీపీ సైతం…బీజేపీ మోసం చేసిందని ఎన్డీయే నుంచి బయటకొచ్చి పోరాటాలు చేసింది.

ఇటు తనకు 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచేస్తానని జగన్ హడావిడి చేశారు. అయితే ప్రజలు జగన్‌ని నమ్మారు…వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చారు..అయినా కూడా కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉందని, మనం ఏమి చేయలేమని, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుకోవాలని జగన్ చేతులెత్తేశారు. అప్పటినుంచి హోదా అంశం అందరూ మర్చిపోయారు. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖ…ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఇక ఇందులో ప్రత్యేక హోదా గురించి కూడా చర్చిస్తారని మొదట చెప్పారు…దీంతో వైసీపీ, దాని అనుకూల మీడియా అదిగో జగన్ హోదా సాధించేసారని హడావిడి చేసేశారు. మొదట 9 అంశాలు చర్చిస్తారని, అందులో రాష్ట్ర డిమాండ్ ప్రత్యేక హోదాకూ చోటు ఇచ్చారు. కానీ నెక్స్ట్ 5 అంశాలకు కుదించి అందులో హోదా లేపేశారు. మరి ఇది కేంద్రం చేసిందా…లేక వైసీపీ గేమ్ ఆడిందా అనేది తెలియదు గాని…మొత్తానికి హోదా విషయంలో పదే పదే మోసమే జరుగుతుంది.

Discussion about this post