ఔను! మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఏడాది టీడీపీ పసుపు పండగ.. మహానాడు అదిరిపోతుం ద నే అంటున్నారు టీడీపీ నాయకులు. ఇప్పటికే రాష్ట్రం సహా.. పొరుగు రాష్ట్రాలు.. అమెరికా, దుబాయ్.. జపాన్ సహా పలు దేశాల్లో మహానాడును ఘనంగా నిర్వహించుకునేందుకు టీడీపీ నేతలు రెడీ అయ్యారు. మరీ ముఖ్యంగా అమెరికాలోని తెలుగు వారు అందరూ ఏకమైనట్టు ఇక్కడి నేతలు చెబుతున్నారు. అక్కడ కూడా రెండు రోజుల పాటు మహానాడును ఇక్కడ ఎలా నిర్వహిస్తారో.. అక్కడ కూడా నిర్వహించనున్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు వారంతా కూడా.. మహానాడును నిర్వహించేందుకు ఉవ్విళ్లూరు తున్నట్టు చెబుతున్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు కనీసం రెండు లక్షల మంది కార్యకర్తలు.. నాయకులు.. ప్రముఖులు హాజరు అయ్యే అవకాశంఉందని తెలుస్తోం ది. ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశంతోపాటు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి.. ముఖ్యంగా అసంతృప్తులను ఎలా తగ్గించాలనే అంశాలపై ఈ కార్యక్రమంలో చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదిలావుంటే.. కొత్తగా పార్టీలో చేరేవారికి మహానాడు వేదికగా మారిందని.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. దాదాపు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి నాయకులు.. కార్యకర్తలు చేసే ఛాన్స్ ఉన్నట్టు తమకు సంకేతాలు అందుతున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లు పార్టీకి అత్యంత కీలకమైన సమయం కాబట్టి.. ఆ సమయంలోగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఇక, యధావిధిగా మహానాడులో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేకంగా చేసే వంటకాలను మహానాడులో కార్యకర్తలు, నాయకులకు రుచి చూపించనున్నారు. వేదికకు తాజాగా భూమి పూజ చేసిన నాయకులు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా .. తట్టుకునేలా సుమారు 2 లక్షల మందికిపైగా కూర్చునేలా.. ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఒంగోలులో అప్పుడే సందడి ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో నగరం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడుతోంది. సుమారు రెండేళ్ల తర్వాత.. నిర్వహిస్తున్న మహానాడు ఈ ఏడాది అదిరిపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

Discussion about this post