బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటు విషయంలో మొన్నటివరకు వైసీపీలో పంచాయితీ నడిచింది. ఇప్పుడు టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతుంది. అయితే గత ఎన్నికల్లో చీరాల సీటు టిడిపి గెలుచుకుంది. కానీ టిడిపి నుంచి గెలిచిన కరణం బలరామ్ వైసీపీలోకి వెళ్లారు. అక్కడ వైసీపీ లో పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు.

కొన్ని రోజుల పాటు కరణం, ఆమంచిల మధ్య పోరు నడిచింది. సీటు తమదంటే తమదని అనుకున్నారు. ఇక చివరికి జగన్ బుజ్జగించి ఆమంచిని పర్చూరుకు పంపారు. ఇటు చీరాలని కరణం కుమారుడు వెంకటేష్‌కు అప్పగించారు. దీంతో కొంతవరకు సీటు సమస్య తగ్గింది. కాకపోతే పర్చూరులో ఉన్న కరణం వర్గం..ఆమంచికి సహకరించదు. చీరాలలో ఉన్న ఆమంచి వర్గం కరణంకు సహకరించదు.
అదే సమయంలో టిడిపి, జనసేన పొత్తు ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే ఆమంచి సోదరుడు స్వాములు..తాజాగా పవన్ తో భేటీ అయ్యారు..జనసేనలో చేరడం ఫిక్స్ అయింది. ఇక పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన తీసుకుని స్వాములుని నిలబెడుతుందని ప్రచారం ఉంది. అయితే ఇక్కడ టిడిపి ఇంచార్జ్ ఎంఎం కొండయ్య ఉన్నారు. ఆయన సైతం సీటు ఆశిస్తున్నారు.