గత ఎన్నికల్లో టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి ఎంత లబ్ది జరిగిందో చెప్పాల్సిన పని లేదు. భారీగా ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ప్రతి జిల్లాలో వైసీపీదే ఆధిక్యం..మెజారిటీ పార్లమెంట్ స్థానాలని క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని సైతం వైసీపీ స్వీప్ చేసింది. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ సీటు వైసీపీ గెలుచుకుంది.
అలాగే పెందుర్తి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి సీట్లని సైతం వైసీపీ గెలుచుకుంది. ఇలా అనకాపల్లిని స్వీప్ చేసింది. మరి ఈ సారి ఆ పరిస్తితి ఉంటుందా? అంటే ఏ మాత్రం ఉండదనే చెప్పాలి. డౌట్ లేకుండా ఈ సారి అనకాపల్లిలో వైసీపీకి భారీ దెబ్బ తగలనుంది. టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో అనకాపల్లిలో వైసీపీకి ఒకటి, రెండు సీట్లలో ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. గాలి మారితే అవి కూడా దక్కవు.

ఈ 7 సీట్లలో టిడిపికి పట్టు ఉంది..పార్టీల పరంగా చూసుకుంటే ప్రస్తుతం నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట సీట్లలో టిడిపికి ఆధిక్యం ఉంది. చోడవరం, మాడుగులలో వైసీపీకి కాస్త ఆధిక్యం కనిపిస్తుంది. ఇక టిడిపి, జనసేన కలిస్తే ఎలమంచిలి, అనకాపల్లి సీట్లని కైవసం చేసుకోవడం సులువు. ఇక జనసేనకు పాయకరావుపేట, పెందుర్తి, చోడవరం సీట్లలో కాస్త ఓటు బ్యాంకు ఉంది..అది టిడిపికి కలిస్తే వైసీపీకి ఓటమే.
ఇక పొత్తులో భాగంగా ఎలమంచిలి సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. అటు చోడవరం, అనకాపల్లి సీట్లలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. మిగిలిన సీట్లు టిడిపికే ఫిక్స్. మొత్తానికి టిడిపి-జనసేన కలిస్తే అనకాపల్లిలో వైసీపీకి భారీ దెబ్బ తప్పదు