జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది..తాజాగా శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్‌పై అభిమానంతో ఆ సభకు ఆది వచ్చి..అధికార వైసీపీ నేతలపై సెటైర్లు పేల్చారు. ఇక ఆది స్పీచ్‌కు మంచి స్పందన వచ్చింది కూడా. అయితే ఎప్పటినుంచో ఆది..జనసేనలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన జనసేన తరుపున ప్రచారం చేశారు.

కానీ ఈ మధ్య జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆది పాల్గొన్నారు. దీంతో ఆది వైసీపీకి మద్ధతు ఇస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆది జనసేన సభలో మెరిశారు. ఇక తన స్పీచ్‌లో ఇక్కడకి ఒక జనసేన అభ్యర్ధిగా వచ్చానని ఆది అన్నాడు. దీంతో అదిగో జనసేన నుంచి ఆది నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారని ప్రచారం మొదలుపెట్టేశారు. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

జనసేన సభ్యుడుగా వచ్చానని ఫ్లోలో చెప్పబోయి అభ్యర్ధిగా అని ఉండి ఉంటాడు. అంతే ఇంకా ఆది నెక్స్ట్ పోటీ చేస్తాడని, అందుకు అభ్యర్ధి అన్నాడని కథనాలు వస్తున్నాయి. ఎలాగో ఆది సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశం. ఇక అక్కడ టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన దర్శి, గిద్దలూరు, ఒంగోలు లాంటి సీట్లు తీసుకోవాలని చూస్తుంది. వీలుని బట్టి ఏదొక సీటులో ఆది పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.

అసలు ఆది లాంటి వారు పోటీ చేస్తే పెద్ద పెద్ద నాయకులు పరిస్తితి ఏంటి. ఆ జిల్లాలో జనసేన నేతలు చాలామంది ఉన్నారు. అలాగే సినిమాల్లో, టీవీ షోల్లో మంచి స్టేజ్ లో ఉన్న ఆది ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం అనేది కూడా డౌటే. కాబట్టి ఆది ఎన్నికల్లో పోటీ చేస్తాడనేది పెద్ద ట్రాష్.

Leave feedback about this