రాజకీయాల్లో పదవులు అనేవి ఎంత కష్టపడితే వస్తాయి…ముఖ్యంగా మంత్రి పదవి లాంటివి రావాలంటే చాలా కష్టపడాలి. అదే సమయంలో పదవి వచ్చాక దాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలి..కానీ అలా కాకుండా ఎడాపెడా పనిచేస్తూ..ప్రజలని పట్టించుకోకుండా, ఏదో నేనే రాజు, నేనే మంత్రి అనే తీరులో పోతే తిప్పలు తప్పవు. ఇప్పుడు జూనియర్ మంత్రి అప్పలరాజు కూడా అదే పొజిషన్‌లో ఉన్నారు.

అసలు తొలిసారి టిక్కెట్ దక్కించుకోవడమే కాకుండా….తొలిసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు…జగన్ వేవ్‌లో పలాసలో సత్తా చాటారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా ఉండగానే, అదృష్టం కొద్ది మంత్రి పదవి కూడా దక్కింది…మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఆయన ప్లేస్‌లో అప్పలరాజుకు లక్కీ ఛాన్స్ దొరికింది. ఇలా తక్కువ సమయంలోనే పెద్ద బాధ్యత వచ్చి పడింది. అలాంటప్పుడు మంత్రిగా చాలా జాగ్రత్తగా పనిచేయాలి. కానీ అప్పలరాజు చేస్తున్నట్లు లేరు.

ఏదో పదవి నిలబెట్టుకోవడం కోసం ప్రత్యర్ధి పార్టీ నేతలని తిట్టే పనిలోనే ఉంటున్నారు…అసలు అప్పలరాజు తన చిన్నప్పుడు అంటే టెన్త్ క్లాస్‌లో ఉండగా …అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేతులపై అవార్డు తీసుకున్నారు. అలా అవార్డు తీసుకున్న అప్పలరాజు…ఇప్పుడు చంద్రబాబుని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం వేరు..కానీ దారుణమైన మాటలతో రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆయన పోలీసులని కూడా ఎలా తిట్టారో అంతా చూశారు.

ఇక పలాసలో టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషపై అప్పలరాజు అనుచరులు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అనుచరులకు అప్పలరాజు సపోర్ట్ ఇస్తున్నారని టాక్. అలాగే అప్పలరాజు రాష్ట్రానికి మంత్రి.. కానీ ఈయన కేవలం పలాసకే పరిమితం అవుతున్నారట. కనీసం శ్రీకాకుళంలో వేరే నియోజకవర్గాలకు కూడా వెళ్ళడం లేదట. అంటే అప్పలరాజు పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..ఇక ఇలాంటి వారు మంత్రివర్గంలో ఉండటం వేస్ట్ అనే డిమాండ్ వస్తుంది. మొత్తానికి అప్పలరాజు తక్కువ సమయంలోనే ఎక్కువ వివాదాల్లో ఉన్నారు.

Discussion about this post