ఏపీలో మరోసారి దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. అధికార బలంతో గెలవాలని చూస్తున్న వైసీపీ దొంగ ఓట్లని సైతం సృష్టించి గెలవడానికి ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో వైసీపీ పక్క రాష్ట్రాల నుంచి సైతం దొంగ ఓట్లర్లని తీసుకొచ్చి గెలిచిందనే ఆరోపణలు ఉన్నాయి. కుప్పం మున్సిపాలిటీలో అలాగే గెలిచిందనే విమర్శలు ఉన్నాయి.
ఈ విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం దొంగ ఓట్లు సృష్టించి గెలవడానికి వైసీపీ సన్నాహాలు చేస్తుందని టిడిపి ఫైర్ అవుతుంది. మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చదువుకున్న వారు వైసీపీపై వ్యతిరేకత ఉన్నారు. ఈ క్రమంలో గెలవడం కష్టమని తెలుసుకున్న వైసీపీ దొంగ ఓట్లు సృష్టిస్తుందని టిడిపి ఫైర్ అవుతుంది. అసలు కనీసం 10వ తరగతి చదవని వారిని సైతం డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి..వారిని పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని టిడిపి ఫిర్యాదులు చేస్తుంది. అయినా సరే అధికారులు సైతం వైసీపీకే సహకరించే పరిస్తితి ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ ఫేక్ ఓట్లపై టిడిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కోర్టులకు వెళ్లడానికి కూడా టిడిపి నేతలు సిద్ధమవుతున్నారు.
బోగస్ ఓట్ల బాగోతంపై ఆధారాలతో విపక్షాలు ఫిర్యాదులు చేస్తుంటే ఏం చేయాలో తెలియక అధికారులు ఇబ్బంది పడే పరిస్తితి. తామున్నామనే భరోసా వైసీపీ ప్రముఖులనుంచి వస్తున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయస్థానాల నుంచి వచ్చే నిర్ణయం ఎంత తీవ్రంగా ఉండబోతోందన్న భయాందోళన యంత్రాంగాన్ని వేధిస్తోంది. చూడాలి మరి ఈ ఫేక్ ఓట్లని దాటుకుని టిడిపి ఏ మేర సక్సెస్ అవుతుందో.