May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

 ఆ మూడుసీట్లలో టీడీపీకి మళ్ళీ డౌటే..గెలుపు కష్టమే!

ఏపీలో దాదాపు అన్నీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆఖరికి జగన్ సొంత జిల్లా కడపలో కూడా టి‌డి‌పికి పట్టు కనిపిస్తుంది. కానీ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే సీన్ రివర్స్ గా ఉంది. ఇక్కడ అనుకున్న వేగంగా టి‌డి‌పి బలపడుతున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో 14 సీట్లలో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు 4 సీట్లలో టి‌డి‌పి బలపడింది. మిగిలిన సీట్లలో వెనుకబడే ఉంది.

అంటే జిల్లాలో టి‌డి‌పి ఇంకా బలపడాల్సి ఉంది. అయితే కొన్ని సీట్లలో టి‌డి‌పి బలపడేలా కనిపించడం లేదు. అలాగే గెలవడం కూడా కష్టమనే పరిస్తితి. ముఖ్యంగా మూడు సీట్లలో టి‌డి‌పి గెలవడం కష్టమనే పరిస్తితి కనిపిస్తుంది. పుంగనూరు, పూతలపట్టు, జి‌డి నెల్లూరు స్థానాల్లో టి‌డి‌పి బలంగా లేదు. అసలు ఈ స్థానాల్లో గెలిచి చాలా ఏళ్ళు అయిపోతుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతుంది.

పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే స్థానం..ఇక్కడ టి‌డి‌పి గెలవడం కష్టం. టి‌డి‌పి నాయకులు పోరాడుతున్నారు గాని..అయినా సరే వైసీపీని దెబ్బకొట్టలేకపోతున్నారు.

అంటే అక్కడ అలాంటి పరిస్తితి ఉంది. ఖచ్చితంగా ఈ సీటులో టి‌డి‌పి గెలవడం అసాధ్యమని చెప్పవచ్చు. ఇక పూతలపట్టు ..ఈ స్థానంలో కూడా టి‌డి‌పికి ఏ మాత్రం బలం లేదు. అసలు అక్కడ సరైన నాయకుడు లేడు. ఇప్పటికిప్పుడు నాయకుడుని పెట్టినా సరే పూతలపట్టులో టి‌డి‌పి గెలవడం అసాధ్యమే.

అలాగే గంగాధర నెల్లూరు…అసలు టి‌డి‌పి ఇంతవరకు ఇక్కడ గెలవలేదు. మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా లేడు. అయినా ఇక్కడ మంత్రి నారాయణస్వామిపై ప్రజా వ్యతిరేకత ఉంది అయినా సరే దాన్ని టి‌డి‌పి ఉపయోగించుకోలేక ఉంది. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో టి‌డి‌పి గెలవడం జరిగే పని కాదు.