ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది కనుమరుగయ్యింది. ఏ రాష్ట్రంలోని దుష్ట రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా ఎక్కడ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అని కేసిఆర్ కంగారు పడ్డారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచాల్సిన, హైదరాబాద్ నుండి అక్రమంగా చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసు పెట్టి హైదరాబాదు నుండి బయటకు పంపించారు. బయటకి వచ్చి సొంతంగా అమరావతిని ఏర్పాటు చేసుకుంటుంటే, అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు కేసీఆర్. అమరావతికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపును చూసి తట్టుకోలేకపోయారు.
ఆంధ్రాలో అభివృద్ధి అనేదే ఉండకూడదని తలంపుతో 2019లో జగన్ కి మద్దతు గా ఉండి వైసీపీని గెలిపించారు. టిడిపి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. 2024 లోను వైసీపీ నే అధికారంలోకి రావాలని కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
హైదరాబాదులో జగన్ ఆస్తులు కాపాడుకోవడానికి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కి రావలసిన అన్నింటినీ కేసీఆర్ కు ధారాధత్తం చేశారు. ఆంధ్రకు రావలసిన ఆస్తులు రానివ్వకుండా చేసిన కేసీఆర్ తో జగన్ సన్నిహితంగా ఉంటున్నారు. 2019లో జగన్ గెలుపు కోసం తెలంగాణ నుండి ప్రచారానికి వందల కోట్ల ధనం తెలంగాణ నుండి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ తెలంగాణకు లాభాని చేకూర్చేవి, ఆంధ్రను అధఃపాతాళంలోకి నెట్టేసేవే!! మూడు రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని అనాధ రాష్ట్రాన్ని చేశారు. ఇసుక రీచ్ లను ఆపి రియల్ ఎస్టేట్ ను దివాళా తీయించారు. అభివృద్ధి కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది కానీ ఇక్కడ ఒక రాష్ట్రాన్ని నాశనం చేసి మరో రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఇంతటి దారుణానికి ఓడి కట్టారు కేసీఆర్, జగన్. తెలంగాణలో కేసీఆర్ కు ఓటు వేసి ఆంధ్ర వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి వేయండి మన ఆంధ్రను అభివృద్ధి వైపు నడిపించే నేతను ఎన్నుకుంటే మన తర్వాతి తరానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని ఏపీలోని పలువురు మేధావులు కోరుతున్నారు.