చాలా రోజుల తర్వాత నందమూరి ఫ్యామిలీ ఒకేతాటి పైకి వచ్చింది….గతంలో కాస్త ఫ్యామిలీలో అభిప్రాయభేదాలు ఉన్నట్లు పరిస్తితి ఉండేది. కానీ హరికృష్ణ మరణం తర్వాత కుటుంబం ఏకమైంది. అప్పటినుంచి కలిసికట్టుగానే ఉంటుంది. తాజాగా కూడా టీడీపీలో జరిగిన పరిణామాలు, భువనేశ్వరిపై వైసీపీ నేతలు మాట్లాడిన తీరుపై ఫ్యామిలీ మొత్తం స్పందించింది. కొన్ని రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే, తాజాగా అసెంబ్లీలో పలువురు పలువురు నేతలు భువనేశ్వరిపై పరోక్షంగా అసభ్య పదజాలంతో మాట్లాడిన విషయం తెలిసిందే.

అలా మాట్లాడటంపై చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు….దీంతో టీడీపీ శ్రేణులు అంతా ఏకమై…వైసీపీ నేతలపై ఫైర్ అవుతున్నాయి. అలాగే ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల నేతలు, సినీ ప్రముఖులు సైతం చంద్రబాబుకు మద్ధతుగా నిలుస్తూ…వైసీపీ నేతల తీరుని ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో బాలకృష్ణ సమక్షంలో నందమూరి ఫ్యామిలీ మీడియా సమావేశం పెట్టి…వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు….ఇంకోసారి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు….ఎవరి పేర్లని తీయకుండా…చాలా డిప్లమాటిక్‌గా స్పందించారు. మహిళలని గౌరవించాలని, ఇలాంటి మాటలు అరాచక పాలనకు నిదర్శనమని మాట్లాడి….పరోక్షంగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఏ ఒక్కరి పేరుని కూడా తీయలేదు.

సమాజంలో మగవాడు ఎలా ఉండాలి…మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలనే కోణంలో మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఎన్టీఆర్….కర్రా విరగకూడదు…పాము చావు కూడదు అనే తీరులో మాట్లాడినట్లు కనబడుతోంది. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడే ఒక సైడ్ ఉండకూడదనే కోణంలో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు రాజకీయ పరంగా తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే దీని బట్టి చూస్తే…ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం కష్టమని అర్ధమైంది.

Discussion about this post