తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి వైసీపీ ఎన్ని రకాల ఎత్తులు వేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అయితే నిజాయితీగా రాజకీయం చేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెడితే దాని దారి వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు..అసలు వైసీపీ అలాంటి రాజకీయాలే చేయదు. ఎంతసేపు ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేయడం వైసీపీకి అలవాటైన పనిగా మారింది.
అలాంటి రాజకీయంతోనే మరొకసారి టిడిపికి చెక్ పెట్టాలని చూస్తుంది. గత ఎన్నికల్లో అలాగే చేసింది..వైసీపీ రాజకీయాన్ని ప్రజలు నమ్మారు. ఈ సారి కూడా ప్రజలని నమ్మించి గెలవాలని చూస్తుంది. ఈ క్రమంలో వైసీపీ వేస్తున్న ఎత్తులు ఊహించని విధంగా ఉంటున్నాయి. ఇక టిడిపికి చెక్ పెట్టడానికి దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దెబ్బతీయడానికి ఎన్ని రకాల ఎత్తులు వేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు.

ఇదే క్రమంలో తాజాగా టిడిపి కంచుకోట అయిన కొండపిలో ఇటీవల వైసీపీ ఎలాంటి రాజకీయం చేసిందో చెప్పాల్సిన పని లేదు. వైసీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు..కొండపి టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఇల్లు ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఎక్కడైనా రాజకీయంగా నిరసనలు తెలియజేయవచ్చు. కానీ వైసీపీ డైరక్ట్ ప్రత్యర్ధుల ఇళ్లపైకి వెళుతుంది. ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే స్వామి సైతం పోటీగా నిరసన తెలియజేశారు. కానీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇలాంటి పరిస్తితులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.
అయితే కొండపిలో గెలవడానికి వైసీపీ వేస్తున్న ఎత్తులు అని చెప్పవచ్చు. కానీ ఎన్ని ఎత్తులు వేసిన మళ్ళీ కొండపిలో టిడిపి గెలిచేలా ఉంది. ఈ సారి కూడా అక్కడ టిడిపి జెండా ఎగరడం ఖాయమని చెప్పవచ్చు.