జగన్ ప్రతిసారి 175కి 175 సీట్లు గెలిచేయాలని చెబుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరికీ మనం మంచి చేస్తున్నామని, అలాగే అన్నీ ఎన్నికల్లో గెలుస్తున్నామని కాబట్టి…175 సీట్లు ఎందుకు గెలవకూడదని అంటున్నారు. ఈ 175 కాన్సెప్ట్‌తోనే జగన్ ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తుంటే 175 టార్గెట్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే గొప్పే అన్నట్లు పరిస్తితి ఉంది.

ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు అవగాహన వచ్చేసింది. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు..ఆ ఒక్క ఛాన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి? నష్టాలు ఏంటి? అనేది ప్రజలకు అర్ధమవుతుంది. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నా సరే అభివృద్ధి లేకపోవడం, ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పడటం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం..రోడ్లు పరిస్తితి దారుణంగా ఉండటం..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై నెగిటివ్ రావడానికి. కానీ ఎవరు కూడా ఎదురు తిరిగే చెప్పే పరిస్తితి లేదు. ఇక ఎదురు తిరిగి చెబితే ఏం జరుగుతుందో అందరికీ బాగా తెలుసు. అందుకే ఇప్పుడు అందరూ చాలా సైలెంట్ గానే ఉన్నారు. అంటే స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్చ కూడా లేదు. ఇంకా పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీపై నెగిటివ్ కనిపిస్తోంది. కానీ జగన్ 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. ఇక అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడటానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అదే తరహాలో మాట్లాడారు. క్యాష్ ద్వారా లిక్కర్ అమ్మకాలు చేయడం వలన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నల్ల ధనాన్ని సంపాదించారని, ఈ డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారని, అందుకే 175 నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని అంటున్నారని చెప్పుకొచ్చారు. మరి చూడాలి విష్ణు చెప్పినట్లే జరుగుతుందో లేదో?
