వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారో తెలియదు గాని…ఎక్కువమంది మాత్రం వివాదాల్లో ఉంటూ, ఇతర సమస్యలు సృష్టించడంలో ముందున్నారని చెప్పొచ్చు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొక వివాదంలో చిక్కుకుంటున్న ఎమ్మెల్యేల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకరు. ఆయనకు జగన్‌కు బెస్ట్ ఫ్రెండ్.

మరి ఈయన కాకినాడ సిటీ ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో తెలియదు గాని….సొంత సేవలు చేసుకోవడంలో బాగా బిజీగా ఉన్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి…అలాగే ఈయన ప్రతిపక్ష నాయకులని బూతులు తిట్టడంలో కూడా ఎక్కువ కనిపిస్తారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులపై ఈయన ఎలాంటి బూతులు మాట్లాడారో అందరికీ తెలిసిందే…అలాగే డ్రగ్స్ విషయంలో కూడా ఎమ్మెల్యేకు ప్రమేయం ఉందని టీడీపీ నుంచి ఆరోపణలు వచ్చాయి. ఇక అసెంబ్లీలో లోకేష్ డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ దారుణమైన మాటలు మాట్లాడి కూడా హైలైట్ అయ్యారు

ఇక తాజాగా కాకినాడ రైస్ ఎక్స్‌పోర్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేత పట్టాభి పలు ఆధారాలతో ఆరోపణలు చేశారు. దీనికి ఎమ్మెల్యేకు సంబంధం ఉందనే కోణంలో ఆరోపణలు వచ్చాయి. దీనికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇస్తూ లోకేష్ ఓ డాష్ గాడు అంటూ తీవ్ర పదజాలం వాడారు. ఇలా ఆరోపణలు చేస్తే అందులో నిజం లేదనే నిరూపించే ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది..అలా కాకుండా..అధికారం ఉంది కదా అని ద్వారంపూడి ఎడాపెడా బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని టీడీపీ-జనసేన శ్రేణులు మాట్లాడుతున్నాయి.

ఇలా అధికార గర్వంతో ఉన్న ద్వారంపూడిని ఖచ్చితంగా ఓడించి తీరాలనే కసితో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి…ఈ సారి కాకినాడ సిటీలో ద్వారంపూడి గెలుపుకు బ్రేకులు వేయాలని చూస్తునారు. అయితే టీడీపీ-జనసేన గాని కలిస్తే కాకినాడ సిటీలో ద్వారంపూడికి గెలిచే అవకాశాలు ఉండవు…మరి చూడాలి నెక్స్ట్ ద్వారంపూడి పరిస్తితి ఎలా ఉంటుందో.

Discussion about this post