ఎప్పుడూలేని విధంగా ఏపీలో మంత్రులు హైలైట్ కాకపోవడం…వైసీపీ ప్రభుత్వం వచ్చాకే జరిగిందని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా అప్పుడు మంత్రులు ఎవరనేది జనాలకు కాస్త క్లారిటీ ఉండేది. అలాగే ఏ మంత్రి ఏ శాఖ అనేది కూడా తెలిసేది. మంత్రుల పనితీరు విషయం పక్కనబెడితే కనీసం ఫలానా ఫలానా మంత్రి అంటే ఎవరో తెలిసేది. కానీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రులే జనాలకు పూర్తిగా క్లారిటీ లేకుండా పోయింది.

పనితీరు విషయం పక్కనబెడితే…కనీసం ఎవరు మంత్రి ఎవరు కాదు అనే విషయాలే సరిగ్గా తెలియడం లేదు. అయితే కొందరు మంత్రులు పనితీరు పరంగా కాకపోయినా వేరేలా హైలైట్ అయ్యి మంత్రులని కాస్త జనాలకు తెలుస్తోంది. అంటే ఉదాహరణకు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు మంత్రులని తెలుస్తోంది. ఇక వారు ఏ పరంగా హైలైట్ అయ్యారో జనాలకు బాగా తెలుసు.

సరే ఎలాగోలా మంత్రులని తెలుస్తోంది…కానీ కొందరు మంత్రులనే సంగతి కూడా క్లారిటీ లేకుండా పోతుంది. సాధారణంగా రాజాకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారికి…కొందరు మంత్రులు తెలుస్తున్నారు…మరికొందరైతే అసలు తెలియడం లేదు…అంటే వీళ్ళు కూడా మంత్రులా అని తెలిస్తే షాక్ అయ్యేలా ఉన్నారు. రాజకీయాలపై అవగాహన ఉన్నవారికే సరిగా క్లారిటీ లేకపోతే…ఇంకా జనాలకు వాళ్ళు మంత్రులనే సంగతి ఎలా తెలుస్తుంది.

అలా మంత్రులుగా ఉన్నారని తెలియనివారు కొంతవరకు ఉన్నారు. అందులో ముఖ్యంగా పినిపే విశ్వరూప్, తానేటి వనితలు మంత్రులు అనే సంగతి జనాలకు చాలా వరకు తెలియదట. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో మంత్రులుగా వారి పనితీరు కంటే…అసలు మంత్రులనే సంగతి తెలియదని జనాలు చెబుతున్నారట. అంటే రెండున్నర ఏళ్లలో విశ్వరూప్, వనితలు జగన్ క్యాబినెట్‌లో ఉన్నారని చాలామందికి అవగాహన లేదనే చెప్పొచ్చు. ఆఖరికి వైసీపీలో కొంతమంది కార్యకర్తలకు సైతం తెలియదట. అంటే ఇంకా వైసీపీలో మంత్రుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Discussion about this post