రాజకీయాల్లో వ్యూహాలే కాదు.. లాజిక్ కూడా ఉండాలి. అది లేకపోతే.. నాయకులు అనుకున్నది సాధించ డం చాలా కష్టం. ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. వైసీపీ అధినేత జగన్.. తాజాగా తన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గత మూడేళ్ల కాలంలో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును ఆయన విశ్లేషించారు. తనకు ముఖ్యమంత్రిగా ప్రజలు 65 శాతం ఓట్లేశారని.. తాను సర్వేచేయించానని వెల్లడించారు.

అదేసమయంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు.. కేవలం 40-45 శాతం మార్కులే పడ్డాయన్నారు. అంటే.. మీరు పనితీరు మెరుగు పరుచుకుపోవాలి! అని జగన్ చెప్పకనే చెప్పారు. అంతేకాదు.. ప్రజలు నన్ను, నాపాలనను హర్షిస్తూ.. 65 శాతం మంది ఓకే చెప్పారని.. ఈ తరహా పరిస్థితి మీకు ఎందుకు లేదని.. ఆయన అన్యాపగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జగన్ ఒకచిన్న లాజిక్ మిస్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇదే చర్చ సాగుతోంది.

“అన్ని పథకాలు జగనే ప్రవేశ పెట్టారు. పైగా.. ఆయన హయాంలోనే అనేక సంక్షేమాలు చేశారు. సో.. పాల న చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చివరి నుంచి ఆ చివరకు జగన్ చేతుల మీదుగానే జరుగుతోంది. కానీ, ఆయ నకు 65 శాతం ఎమ్మెల్యేలకు 45 శాతం లోపల రావడం ఏంటి? ఇలా జరిగిందంటే.. లోపం ఎక్కడుందో తెలియడం లేదా!“ అని ఓ సీనియర్ మంత్రి.. వ్యాఖ్యానించారు. అంటే.. జగన్ విషయంలో జరిగింది.. ర్యాండమ్‌తీసుకున్న సర్వే! అంటే కేవలం ఒక జిల్లాకే పరిమితం కాలేదు.

కానీ, ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. వారి వారి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే. ఇదే అసలు సిసలు సర్వే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అక్కడక్కడా ప్రజలను అభిప్రాయాలు కోరడం .. సహజం. దీనివల్ల పూర్తి ఫలితం రావడమూ కష్టమేనని చెబుతున్నారు. అలాకాకుండా.. ఒకనియోజకవ ర్గాన్ని యూనిట్ గా తీసుకుని చేసిన సర్వేలో అన్ని వర్గాలప్రజల భాగస్వామ్యం ఉంటుంది. సో.. వారు చెప్పేది వాస్తవం. కాబట్టి.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా.. జగన్ గురించి కూడా చేసి ఉంటే.. ఆయనకు కూడా ఇదే రేంజ్ లో ప్రజలు మార్కులు వేసి ఉండేవారని అంటున్నారు.

Discussion about this post