ఏపీ సీఎం జగన్ ప్రసంగాలు వినలేకపోతున్నామనే వాదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. జగన్ ఎక్కడ ఎలాంటి సభ నిర్వహించినా.. రాసిచ్చిన స్క్రిప్టునే చదువుతున్నారు. అయితే.. అది కూడా తప్పులు చదువుతుండడం.. నంగి నంగిగా మాట్లాడుతుండడంతో ప్రజలు తల పట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆయా వీడియోలను ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్నాయి. కానీ, దీనిలో ఉన్న వాస్తవానికి గ్రహించే పరిస్తితి లేక.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ.. వైసీపీ నేతలు తీసేపారేస్తున్నారు.

కానీ, తాజాగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన సభలో రైతులకు ఇచ్చే `పట్టాదారు పాసుపుస్తకా లు` అనే పదాన్ని కూడా సీఎం జగన్ పలకలేక పోయారు. అదేసమయంలో `డబ్బు` అనే మాటను `డమ్ము` అని పలికారు. మరి ఆయనకు రాకనా.. లేక తెలియకనా.. లేక ముందుగానే స్టడీ చేయకపోవడం వల్ల వస్తున్న తిప్పలా.. ఏదేమైనా.. జగన్ ప్రసంగం ప్రారంభించి.. తడబాట్లు మొదలు పెట్టగానే ప్రజలు సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ప్రసంగం మేం వినలేక పోతున్నాం! అని మహిళలు సైతం అనేశారు.

నిజానికి జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో అనేక సభలు నిర్వహించారు. అనేక చోట్ల వందల ప్రసంగాలుచేశారు. అప్పట్లో ఎక్కడా తడబడలేదు. ఎక్కడా ఒక్క తప్పు కూడా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినా.. ఫ్యాక్చువల్ ఎర్రర్ అయిందే తప్ప.. తెలుగులో లోపాలు కనిపించలేదు. దీంతో జగన్ ప్రసంగాలు వినేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు కానీ.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత.. ఆయన ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతున్నారు. నిజానికి ఇందులో చూసి చదవాల్సిన అవసరం ఏమీ లేదు.

ఏదైనా లెక్కలు, గణాంకాలు ఉంటే తప్ప. కానీ, ప్రతి విషయాన్నీ ఆయన చూసే చదువుతున్నారు. అప్పుడు కూడా తప్పులు మాట్లాడుతుండడంతో జనాలు చెవులు మూసుకుని.. ఛానెల్ తిప్పేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. కనీసం చూసి చదవడం అయినా.. నేర్చుకోండి బాబూ.. అనే కామెంట్లు చేస్తున్నారు. మరి జగన్ మారతారో లేదో చూడాలి. ఏదేమైనా.. ఎన్నికలకుముందు దంచి కొట్టిన ప్రసంగాలకు.. ఇప్పుడు తడబడుతున్న తీరుకు.. ఆయనైనా వ్యత్యాసం తెలుసుకుంటే బాగుంటుందని అంటున్నారు.

Discussion about this post