ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సీఎం జగన్‌పై మరో బాంబు పేల్చేందుకు రెడీగా ఉందా? సీఎం ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించిందా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ ప్రముఖులు. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ ప్రచార అస్త్రంగా తీసుకునేందుకురెడీ అయింది. నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను.. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు ప్రజలలోకి తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇది ఎక్కడైనా ఉంది. ఎవరైనా అదే చేస్తారు. అయితే.. ఇప్పటి వరకు టీడీపీ ఇలాంటివి తీసుకువెళ్లినా.. అనుకున్న విధంగా సక్సెస్ కాలేక పోయింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు.. `జగన్ వేలితో జగన్ కన్ను పొడుద్దాం` అనే సూత్రాన్ని తెరమీదకి తేనుంది. దీని కింద.. గత 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు జగన్ ఇచ్చిన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేక పోయారు? అనే విషయాన్ని.. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని.. హోదా అంశాన్ని ముడిపెట్టి.. జగన్‌ను ఇరుకున పెట్టాలని.. తాజాగా నిర్ణయించుకోవడం గమనార్హం. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో.. ఉన్న హామీల్లో సింహభాగం పూర్తిచేశామని.. పార్టీ నాయకులు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇబ్బందులు వచ్చినా.. సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు.

అయితే.. ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి వంటివాటి విషయంలో మా త్రం.. ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకబడిందనే చెప్పాలి. అయితే.. ఇది అసాధారణమేమీ కాదు. ఎందుకం టే.. ఆయా హామీలను నెరవేర్చాల్సింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు. అయితే.. కేంద్రం ఇప్పుడు ఏపీని పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను పదే పదే వినిపిస్తూనే ఉంది. అయితే.. కేంద్రం మాత్రం హోదా విషయంలో పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రత్యేక హోదా అంశం.. ఇలా తెరమీదికి వచ్చి అలా మరుగై పోయింది.

దీంతో ఈ విషయంప్రతిపక్షానికి, అధికార పక్షానికిమధ్య తీవ్ర వివాదానికి రాజకీయ విమర్శలకు కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ.. అధినేత చంద్రబాబు.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వైసీపీపై వ్యతిరేకత పెరిగేలా చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనిని మూడు దశల్లో అమలు చేయాలని.. ఎన్నికల సమయానికి తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందోచూడాలి. ఏదేమైనా.. తాము సాధించలేనిది.. వద్దని వదులుకున్నది అయిన.. హోదాపై టీడీపీ ప్రజల్లోకి వెళ్తే.. మళ్లీ 2019 ఫలితే ఎదురవుతుందేమో.. ఆలోచించుకోవాలని.. అభిమానులు చెబుతున్నారు.

Discussion about this post