May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

గుడివాడలో జగన్..కొడాలికి యాంటీ తగ్గించడానికేనా?

వరుసగా నాలుగుసార్లు గుడివాడలో గెలుస్తూ వస్తున్న కొడాలి నాని..ఐదోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి కొడాలి సులువుగా గెలవడం కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు గుడివాడలో కొడాలికి కాస్త యాంటీ ఉంది..వైసీపీకి ఉండే ఓటర్లు, కొడాలికి ఉండే ఫాలోవర్స్ ఉన్నారు..కానీ అక్కడ న్యూట్రల్ ఓటర్లలో మార్పు కనిపిస్తుంది.

2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన కొడాలి..అప్పుడు టి‌డి‌పి ప్రతిపక్షంలో ఉండటం వల్ల గుడివాడకు ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి 2014లో గెలిచిన కొడాలి..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. దీంతో అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. ఇక గుడివాడ ప్రజలు..ప్రతిపక్షంలో ఉండటం వల్ల కొడాలి ఏం చేయలేకపోతున్నారని, మళ్ళీ 2019లో అవకాశం ఇచ్చారు. కానీ ఈ సారి అధికారంలోకి వచ్చారు..మంత్రి అయ్యారు. మరి ఇప్పుడేమైనా చేశారంటే..మంత్రిగా ఉన్నా, తర్వాత పదవి పోయినా పెద్దగా గుడివాడలో అభివృద్ధి జరగలేదు. ఇక ప్రభుత్వ పథకాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

అవి జగన్ అమలు చేసేవి..మరి కొడాలి ప్రత్యేకంగా గుడివాడ కోసం ఏం  చేశారంటే చెప్పడానికి ఏమి లేనట్లే కనిపిస్తుంది. గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేవు…కొన్ని చోట్ల తాగునీటి వసతులు పెద్దగా లేవు. ఇలా కనీస అవసరాలు తీర్చలేని పరిస్తితి. ఈ నేపథ్యంలో కొడాలికి కాస్త యాంటీ వస్తుంది. ఈ క్రమంలో సి‌ఎం జగన్ గుడివాడలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 19న గుడివాడలో భారీ సభకు ప్లాన్ చేశారు.

అలాగే టిడ్కో ఇళ్లని లబ్దిదారులకు ఇస్తున్నారు. ఇక గుడివాడలో కొత్త బస్టాండ్‌కు శంఖుస్థాపన చేయనున్నారు. అయితే టిడ్కో ఇళ్ళు గత టి‌డి‌పి హయాంలో కట్టినవే. ఇప్పుడు బస్టాండ్‌కు శంఖుస్థాపన చేస్తే..ఎప్పటికీ పూర్తి అవుతుందో క్లారిటీ లేదు. కానీ జగన్ ని తీసుకొచ్చి గుడివాడలో కాస్త యాంటీని తగ్గించుకోవాలనేది కొడాలి ప్లాన్. మరి అది ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి.