రాజకీయాల్లో నాయకులపై ప్రజా వ్యతిరేకత ఎప్పుడైనా రావొచ్చు…అయితే ఆ వ్యతిరేకతని తగ్గించుకుని నాయకులు పనిచేయాలి. కానీ అదేంటో గాని ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి…వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. అదేదో కంటిన్యూ ప్రాసెస్ మాదిరిగా వెళుతుంది…సరే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే, దాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. కానీ జగన్ ప్రభుత్వం అలా చేయదు…డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.

ఒక సమస్యని కవర్ చేయడానికి మరో సమస్యని సృష్టిస్తూ పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో అదే జరిగిందని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంటున్నారు. జనం కోరుకొని వాటిని తీసుకొచ్చి, వాటి ద్వారా వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడమే జగం ప్రభుత్వం ఉద్దేశంలాగా కనిపిస్తోంది. అలా వచ్చిందే మూడు రాజధానులు…ఇది ప్రజలు అసలు కోరుకోలేదు. అమరావతి అభివృద్ధి చేస్తే చాలు అనుకున్నారు. కానీ మూడు రాజధానులు తీసుకొచ్చి, ప్రాంతాల వారీగా చీలికలు తీసుకొచ్చేశారు.

అలాగే జిల్లాల విభజన కాన్సెప్ట్ ఎప్పటినుంచో నలుగుతుంది. దీనిపై కూడా జనం పెద్దగా ఆసక్తిగా లేరు. ఇంతకాలం తమ తమ జిల్లాలతో ఎమోషనల్‌గా ఎటాచ్ అయి ఉంటారు..సడన్‌గా జిల్లా మారిపోతుంది…పేరు మారిపోతుంది..దీంతో జనం ఈ జిల్లాల విభజనపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా విభజన సమయంలో ఏదొక వివాదం రావడం గ్యారెంటీ.

అయితే ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న సమయంలోనే జిల్లాల విభజనని తెరపైకి తెచ్చారు. దీని వల్ల ఇష్యూ డైవర్ట్ అయ్యి…జనమంతా జిల్లాల విభజన గురించి మాట్లాడుకుంటారు…పైగా జన గణన పూర్తయ్యేదాకా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం ఎప్పుడో చెప్పేసింది…మరి అవ్వని ప్రక్రియని జగన్ ప్రభుత్వం ఎందుకు స్టార్ట్ చేసిందో…జనమే అర్ధం చేసుకోవాలి. 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ జిల్లాల గోలలో మిగిలిన సమస్యలు అన్నీ అస్సాం పోయేలా ఉన్నాయి…అందుకే జిల్లాల రాజకీయం మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు.

Discussion about this post