విశాఖపట్నంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక…విశాఖ వేదికగా ఎలాంటి రాజకీయాలు చేసిందో అందరికీ తెలిసిందే. అసలు విశాఖలో పార్టీని మరింత స్ట్రాంగ్ చేయడానికి….విశాఖ నగరంలో నాలుగు సీట్లు గెలిచిన టిడిపిని మరింత వీక్ చేయడానికి…వైసీపీ ఎన్ని రకాల వ్యూహాలతో ముందుకెళ్లిందో కూడా తెలిసిందే. అలాగే మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

అయితే ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి విశాఖకు పెద్దగా ఒరిగింది ఏం లేదనే చెప్పొచ్చు. కానీ వైసీపీ రాజకీయంగా బలపడటానికి అనేక ప్రయత్నాలు చేసింది…ఇక ఆ ప్రయత్నాలు ఇప్పుడు విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్కడ వైసీపీ నేతల వల్ల కావొచ్చు….ప్రభుత్వ విధానాల వల్ల కావొచ్చు…విశాఖలో వైసీపీకి కాస్త నెగిటివ్ పెరిగినట్లే కనిపిస్తోంది. పైగా ఇటీవల ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టి మరీ జగన్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది.

ఈ అంశంపై విశాఖ ప్రజలు కాస్త గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేని స్థితిలో ఉంది….పైగా తామే కొనుక్కుంటామని మాట్లాడుతుంది. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రతిపక్షాలు నిత్యం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టడంపై బిజేపి నేత విష్ణు కుమార్ రాజు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

జగన్ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో విశాఖలో వైసీపీకి డిపాజిట్లు దక్కవాని అంటున్నారు. డిపాజిట్లు విషయం పక్కనబెడితే…విశాఖలో ప్రజలు కాస్త వైసీపీకి యాంటీ అవుతున్నట్లే కనిపిస్తోంది. రాజధాని అంశంపై కూడా అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి ఈ సారి విశాఖ ప్రజలు వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చేలాగానే ఉన్నారు. ఈ సారి వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చేలా కనబడటం లేదు.

Discussion about this post