జగన్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ప్రేమ తగ్గలేదని, కాపులకు అన్యాయం చేస్తున్న సరే..ఇంకా జగన్ కోసమే ముద్రగడ తపిస్తున్నారని టీడీపీ, జనసేన వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. కాపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన పట్టించుకోలేదు..జగన్ కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని చేతులెత్తేసిన ముద్రగడ మాత్రం బాబునే టార్గెట్ చేశారు.

ఆఖరికి కేంద్రం అగ్రవర్గాల పేదలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో బాబు..5 శాతం కాపులకు ఇచ్చారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఒక కులానికి 5 శాతం ఇవ్వడం కుదరదు అని టోటల్ గా ఆ రిజర్వేషన్లని జగన్ అమలు చేయలేదు. కానీ బాబు అధికారంలో ఉన్నంత కాలం హడావిడి చేసిన ముద్రగడ..జగన్ అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం లేదు. ఆఖరికి 5 శాతం తీసేసిన మాట్లాడలేదు.

కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లని ఎలాగైనా అమలు చేసుకోవచ్చని, ఆ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయని చెప్పి..గత చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించినట్లు అయింది. దీంతో అంతా ఐదు శాతం కాపులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ముద్రగడ..జగన్‌కు లేఖ రాశారు. ఒకసారి ఐదు శాతం రిజర్వేషన్లని ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

పైగా చివరిలో తమని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని, కేవలం కాపు జాతి కోసమే అడుగుతున్నానని జగన్‌పై ఉన్న ప్రేమని చాటి చెప్పేలా ముద్రగడ లేఖ రాశారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు..ముద్రగడపై ఫైర్ అవుతున్నారు. అప్పుడేమో ఓ హడావిడి చేసి తమని నెగిటివ్ చేసి..జగన్‌కు మేలు చేశారని, కానీ ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నా నోరు విప్పడం లేదని అంటున్నారు.

Leave feedback about this