ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొన్ని చోట్ల వ్యతిరేకత.. వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వం ఎక్స్ పెక్ట్ చేసింది వేరు. ఎందుకంటే.. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తాము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని.. వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే అప్పులు చేసి మరీ సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలకు లక్షా 25 వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద పంచి పెట్టారు.

ఇవిఅధికారికంగా వైసీపీ వెల్లడించిన గణాంకాలే. దీనిని బట్టి.. తమకు అసలు వ్యతిరేకత ఎక్కడ ఉంటని ఎలా ఉంటుందని.. లెక్కలు వేసుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలోకి వెళ్లిన తర్వాత.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. దీనిలో ప్రదానంగా అభివృద్ది మాట వినిపిస్తోంది. రహదారులు బాగోలేదని.. కనీసం డెవలప్ మెంట్ కూడా లేదని.. ప్రజలు గగ్గోలు పెడడుతున్నారు. దీనికి ఎమ్మెల్యేలు, మంత్రులు సర్దిచెప్పలేక తలపట్టుకుంటున్నారు.

అయితే.. ఆయా విషయాలను లోతుగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్టానం.. దిద్దుబాటుకు దిగుతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే..నిన్న మొన్నటి వరకు తమ ప్రభుత్వం విపక్షాలు చేసిన విమర్శలను రాజకీయంగానే చూసిన అధిష్టానం.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నాక.. కూడా ఉపేక్షిస్తే.. మొదటికే మోసం వస్తుందని.. లెక్కలు వేసుకుందట. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు విరుగుడు కనిపెట్టడంతోపాటు.. వచ్చే ఎన్నికల నాటికి దిద్దుబాటు చర్యలు చూపేలా హైపవర్ కమిటీని వేయాలనినిర్ణయించుకున్నట్టు సమాచారం.\

సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కీలక మంత్రులతో ఏడుగురుతో కూడిన హైపవర్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి.. సమస్యలు ఏంటి? ఏంచేయాలి? ఎప్పటికల్లా వాటిని పూర్తి చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది? మూడు రాజధానుల విషయం ఏంచేయాలి? వంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇచ్చేలా ఈ కమిటీ పనిచేస్తుందని అంటున్నారు. తద్వారా.. మార్పులు చేర్పులు.. దిద్దుబాట్లకు ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.

Discussion about this post