జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు గురించి ఊహించని ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. మండలి రద్దు అని హడావిడి చేసిన సమయంలో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణని తప్పించి..అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక తర్వాత 14 మంది మంత్రులని పక్కన పెట్టి..కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

అయితే తాజాగా కొందరు మంత్రుల పనితీరు బాగోలేదని, వారిని సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని జగన్ డైరక్ట్ గా చెప్పేశారు. మంత్రుల పనితీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని సరిగ్గా పనిచేయని వారిని ఆడిట్ చేస్తున్నామని, అవసరమైతే వారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ తాజాగా కేబినెట్ సమావేశంలో చెప్పారు. మంత్రులు దూకుడుగా ఉండాలని, అసెంబ్లీ చర్చల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడాలనే విధంగా జగన్ ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలు గెలవాలని మంత్రులకు టార్గెట్ ఇచ్చారు.

ఈ టార్గెట్ గాని ఫెయిల్ అయితే ఒకరిద్దరుని తప్పించడానికి వెనుకాడనని అన్నారు..అవసరమైతే సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దీంతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది..ఎవరి పదవి పోతుందనే టెన్షన్ కనిపిస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం ఉంది..ఈలోపు మంత్రివర్గంలో మార్పులు చేసే ఛాన్స్ లేకపోలేదు.
ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు మంత్రులని తప్పించి వారి ప్లేస్ లో ఎమ్మెల్సీలుగా ఉన్నవారిని మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ ని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. చూడాలి మరి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారో లేదో.