టీడీపీ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుని.. ఇటీవల కాలంలో చాలా దూకుడుగా ఉన్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు. రాజకీయంగానే కాకుండా.. స్థానికంగా ఉన్న సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని అన్ని కోణాల్లోనూ ప్రశ్నిస్తున్నారు. వారే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, పరుచూరు ఎమ్మెల్యే.. ఏలూరి సాంబశివరావు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరాజయం పాలైనా.. ప్రకాశంలో మాత్రం నలుగురు గెలిచారు. ఒకరు వైసీపీకి అనుకూలంగా మారిపోయినా.. ముగ్గురు మాత్రం గట్టి వాయిస్ వినిపిస్తున్నారు.

ముఖ్యంగా.. నిత్యం ప్రజల్లో ఉండడమే కాకుండా.. జిల్లా సమస్యలపై.. సర్కారును నిలదీస్తున్నారు. నిజానికి ప్రకాశం జిల్లాకు వరదాయిని వంటి.. వెలిగొండ ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే.. మిగిలిన ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు.. నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే.. దీనిని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొనకపోవడంతోపాటు.. అసలు ఈ ప్రాజెక్టును జాబితా నుంచి తీసేయాలని.. తెలంగాణ అధికారులు.. కేంద్రానికి లేఖలు సంధించారు. ఆయా పరిణామాలపై వెంటనే రియాక్ట్ అయిన.. టీడీపీ త్రిమూర్తులు.. గొట్టిపాటి, డోలా, ఏలూరిలు.. తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ సంధించి.. సంచలనం రేపిన విషయం తెలిసిందే.

తమ జిల్లాకు అన్యాయం చేయొద్దని ఆయనను వేడుకున్నారు. వెలిగొండ అక్రమ ప్రాజెక్టయితే.. తెలంగా ణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు కూడా అంతేనని.. కుండబద్దలు కొట్టారు. నెల రోజుల కిందట వీరు రాసిన లేఖ తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే.. అంతటితో ఊరుకోకుండా.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఈ ప్రాజెక్టును పూర్తి చేయించేందుకు.. రైతులకు నీరు అందేందుకు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా జగన్‌కు సైతం వారు లేఖ సంధించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయడం తగదంటూ.. ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు.. జగన్ పాలన ప్రారంభించిన తర్వాత 23 నెలలకు తొలిసారి ప్రకాశం జిల్లాకు వస్తున్నారని.. కనీసం ఇప్పటికైనా.. ఇక్కడి సమస్యలపై దృస్టి పెట్టాలని.. వారు విన్నవించారు. రైతాంగానికి సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు.. రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడం.. మంచి స్పందన రావడం గమననార్హం. నిజానికి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఇద్దరు మంత్రు లు ఉన్నారు. అదేవిధంగా ఒక ఎంపీ(ఒంగోలు) ఉన్నా..కూడా ఇక్కడి సమస్యలు.. ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకున్న నాథుడు ఒక్కరంటే.. ఒక్కరు కూడా లలేరని అంటున్నారు స్థానిక ప్రజలు.

ఇక, టీడీపీ త్రిమూర్తులు చేస్తున్న ప్రయత్నం.. అందరిలోకీ వెళ్తోంది. తమ సమస్యలు చెప్పుకొనేందుకు.. అవకాశం లేదనుకునేవారికి.. టీడీపీ ఎమ్మెల్యేలు.. ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని అంటున్నారు రైతులు. నిరంతరం.. ఇక్కడ సమస్యలపై దృస్టి పెట్టడమే కాకుండా.. ఆయా సమస్యలపై స్పందించడం.. ప్రభుత్వాలకు లేఖలు రాయడం వంటి పరిణామాలు.. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.

Discussion about this post