రాజకీయాల్లో వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి..ప్రత్యర్ధులకు అందకుండా…ప్రజలని ఆకర్షించేలా ఉండాలి..అలా కాకుండా ఎప్పుడూ ఒకే రకంగా పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యూహాలు వేస్తే..అవి పెద్దగా వర్కౌట్ కావు…పైగా అవి వర్కౌట్ అవుతాయనుకోవడం పెద్ద భ్రమ అని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్ కూడా అదే భ్రమలో ఉన్నట్లే కనిపిస్తున్నారు. ఎందుకంటే జగన్ ఎప్పుడు ఒకే అస్త్రాన్ని నమ్ముకుంటున్నారు…అదే సెంటిమెంట్ అస్త్రం. అసలు జగన్ పార్టీ పెట్టిందే వైఎస్సార్ చనిపోయారనే సెంటిమెంట్ మీద. వైఎస్సార్ సెంటిమెంట్ తో వైసీపీ పెట్టారు. అలాగే జగన్ జైలుకు వెళ్లారు.

అయితే ఈ సెంటిమెంట్ 2012 ఉపఎన్నికల్లో బాగా ఉపయోగపడింది…అసలు వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఇక అప్పుడు ఊపుని చూసి 2014 ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయం సాధించి అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు..కానీ రెండేళ్లలోనే సెంటిమెంట్ తారుమారైంది..అన్నివేళలా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని నిరూపించబడింది…అనూహ్యంగా టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది.

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్ జగన్ కు బాగా కలిసొచ్చింది. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనాలని అడిగారు. ప్రజలు సైతం..సరే ఒక్కసారి జగన్ ని సీఎం చేస్తే ఏం చేస్తే చూస్తారని, మూకుమ్మడిగా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు..జగన్ ని సీఎం చేశారు. ఈ మూడేళ్లలో జగన్ ఏం చేస్తున్నారో, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో జనం బాగా చూశారు. జగన్ పాలన చూసి..మరొకసారి ఆయనకు అవకాశం ఇవ్వడం వేస్ట్ అనే నిర్ణయానికి పజాలు వచ్చేలా ఉన్నారు.

ఇలాంటి తరుణంలో మళ్ళీ జగన్ సెంటిమెంట్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. తాను ఒక్కడినై ప్రజల కోసం పనిచేస్తున్నానని …కానీ దుష్ట చతుష్టయం అంటే చంద్రబాబు…టీడీపీ అనుకూల మీడియా సంస్థలు తనని దెబ్బకొట్టాలని చూస్తున్నారని, ప్రజలే తనని కాపాడుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే జగన్ అసలు ఎలాంటి తప్పులు చేయనట్లు…అలాగే ఆయనకు అనుకూల మీడియా సంస్థలు ఏమి లేనట్లే చెబుతున్నారు.

ఓ రకంగా చెప్పాలంటే గురివింద సామెత జగన్ కు బాగా వర్తిస్తుందని విశ్లేషకులు అంటున్నారు…తాను ఎన్ని తప్పులు చేశారో ప్రజలకు బాగా తెలుసని, ఆ తప్పులు కవర్ చేసుకుంటూ…చంద్రబాబుపై విషం చల్లే కార్యక్రమం చేస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా సెంటిమెంట్ అనే ఔట్ డేటెడ్ వ్యూహంతో జగన్ మళ్ళీ గెలవడం కష్టమని అంటున్నారు.

Discussion about this post