రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఒకరి మైనస్‌లు మరొకరికి ప్లస్‌లు కావొచ్చు. ఒకరి వీక్‌నెస్‌లు మరొకరికి ప్లస్ కావొచ్చు. ఇదే వ్యూహం ఇప్పుడు.. టీడీపీలో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేం దుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని భావిస్తున్న టీడీపీకి ఎలాంటి వ్యూహాలు అవసరం లేకుండా.. ప్రస్తుత వైసీపీ పాలనే ఆయుధంగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. కీలకమైన ఐదు విష యాల్లో జగన్ విఫలమైన నేపథ్యంలో ఇదే టీడీపీకి పంచతంత్రంగా మారి.. విజయాన్ని చేరువ చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో సందేహం అక్కర్లేదని చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ విషయంలో టీడీపీ ప్రజల్లోకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజల ఆలోచనా విధానం ఇలానే ఉం దని అంటున్నారు. జగన్ పాలన తీసుకుంటే.. ఆర్థికంగా రాష్ట్రం అప్పుల పాలైంది. దీనిని ప్రజల్లో ఏ వర్గం కూడా సహించడం లేదు. అందుకే.. చంద్రబాబును కోరుకుంటున్నారని .. పరిశీలకులు చెబుతు న్నారు. చంద్రబాబు హయాంలో ఆచితూచి అప్పులు చేసేవారని.. ఇప్పుడు ఒకటో తారుకు రావడమే ఆలస్యంగా అప్పులు చేస్తున్నారని అంటున్నారు. ఇక, రెండోది రాజధాని. రాష్ట్రానికి రాజధాని లేకపోవడంపై అన్ని వర్గాలు ఆగ్రహంతోనే ఉన్నాయి.
మూడు రాజధానులు అన్న జగన్‌కు ఇప్పటిలో అవకాశం లేదు. పైగా అమరావతిని కావాలని.. మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు వస్తే.. తప్ప రాజధాని ముందుకు సాగదని.. చె బుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయంలోనూ ప్రజలు బాబుకే మద్దతిస్తున్నారు. మూడోది.. ఉపాధి లేక పోవడం. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కూడా పర్మినెంట్‌వి ఇవ్వలేదనే ఆవేదన నిరుద్యోగుల్లో ఉంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ వంటివి రెగ్యులర్‌గా జాబులు ప్రకటించడం లేదు. దీంతో వీరు కూడా బాబు హయాంను గుర్తుకు చేసుకుంటున్నారు.
నాలుగోది… పంచాయతీ నిధులు. గతంలో చంద్రబాబు హయాంలో క్రమం తప్పకుండా.. పంచాయతీలకు నిధులు ఇచ్చేవారు. ఇప్పుడు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా జగన్ సర్కారు వాడేసుకుంటోంది. దీంతో పంచాయతీల్లో సెగ మామూలుగా కనిపించడం లేదు. ఇది కూడా బాబుకు లబ్ధి చేకూర్చనుంది. అదేవిధంగా విద్యుత్ వ్యవస్థ. బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెంచకపోగా.. నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు.. ఆయనను మరోసారి పంచతంత్రంగా ముందుకు నడిపిస్తుందని.. గెలుపు గుర్రం ఎక్కిస్తుందని అంటున్నారుపరిశీలకులు.
Discussion about this post