జగన్ సొంత జిల్లా కడప అంటే వైసీపీ కంచుకోట..అక్కడ ప్రతి స్థానంలో వైసీపీకి పట్టు ఉంది. అందుకే గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచేశారు. అలాంటి కంచుకోటలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. సొంత జిల్లాలో కూడా జగన్ అభివృద్ధి చేసింది లేదు..అలాగే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు లేవు. అటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో పాటు వైసీపీలో ఉన్న అంతర్గత పోరు పెద్ద మైనస్ అవుతుంది.

ఉమ్మడి కడప జిల్లాలో పలు స్థానాల్లో ఆధిపత్య పోరు ఉంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌ల మధ్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రాచమల్లుకు రమేశ్ సహకరించే పరిస్తితి లేదు. ఇటు జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలకు పడటం లేదు. సుబ్బారెడ్డి వర్గాన్ని సుధీర్ పట్టించుకోవడం లేదు. దీంతో ఆ వర్గం..నెక్స్ట్ ఎన్నికల్లో సుధీర్‌కు సహకరించకూడదని భావిస్తుంది.
ఇక జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్న కమలాపురంలో అదే పరిస్తితి. అక్కడ రవీంద్రకు వ్యతిరేకంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి వర్గంతో పడటం లేదు. బద్వేలులో ఎమ్మెల్యే సుధకు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వర్గం చెక్ పెట్టేలా ఉంది.
అటు మైదుకూరు, కడప టౌన్‌ల్లో కూడా వైసీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఈ పోరు ఇంకా పెద్దది అయితే..కడపలో వైసీపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
