వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపు గుర్రం ఎక్కితీరాలని ఇప్పటికే సంకల్పం చెప్పుకొన్న టీడీపీ.. దానికి అనుకూలంగా అడుగులు వేస్తోంది. ఈ నెల లేదా.. వచ్చే నెల ఆఖరులో గా.. సగానికి పైగా నియోజ కవర్గాల్లో.. టికెట్లను ఖరారు చేయడంతోపాటు.. ప్రచార బాధ్యతలను జిల్లాల వారీగా ప్రకటించాలని.. చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. అంతేకాదు.. ఈ దఫా.. ప్రచారాన్ని డిజిటల్ రూపంలోనే కాకుండా. ప్రజలను కలుసుకుని.. వైసీపీ వైఫల్యాలపై వివరించాలని ప్రతిపాదించారు.

ఇది ఒకవైపు సాగుతూనే.. వైసీపీ వేస్తున్న అడుగగులకు ప్రత్యామ్నాయంగా అడుగులు వేయాలని.. పార్టీ లో స్పీడ్ పెంచాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో అటు వైసీపీ పార్టీని గెలిపించే బాధ్యతను నాయకులపై వదిలేస్తే.. ఇటు తనతోపాటు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ.. కోస్తాలకు సంబంధిం చి సీనియర్ నాయకులకు పార్టీని గెలిపించేబాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా.. పార్టీలో కీలకమైన పరిణామాలకు పెద్ద పీట వేసేందుకు అవకాశం ఉంటుందనిఅంటున్నారు.

అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో టార్గెట్ వైసీపీకి 175 కాగా.. టీడీపీ 120 – 130 వరకు పరిమితం కావాలని.. తాజాగా మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా.. గట్టిగా గెలుస్తామనే నియోజకవర్గాలపై మరింత ఫోకస్ పెంచడంతోపాటు.. నాయకులను ఒకటికి పదిసార్లు నియోజకవర్గంలో తిప్పేందుకు తాను కూడా ప్రతినియోజకవర్గంలోనూ.. తిరిగేందుకు అవకాశం అవసరం ఉంటుందని.. ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పోటీ ని దీటుగా తట్టుకోవాలని నిర్ణయించారు.

ఇక, కొత్త మొహాలతో పాటు.. పాత యువతకు కూడా టికెట్లు ఇవ్వనున్నారు. కొత్తగా ఇచ్చేవారిని మిశ్రమ ఫలితాలు వస్తాయని.. ఆశిస్తున్న నియోజకవర్గాల్లో వఅవకాశం ఇవ్వడం ద్వారా.. ప్రజలను ఆకర్షించే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఉన్న మోనాటినీని తగ్గించి.. ప్రజలకు కొత్త రాజకీయాలు అందించే వ్యూహాలను అమలు చేయొచ్చని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఏదేమైనా..జగన్ వ్యూహాలకు దీటుగా ముందుకు సాగాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.

Discussion about this post