ఆదాయం కోసం జగన్ ప్రభుత్వం అభివృద్ధి కంటే..వేరే దారుల్లో ఆదాయం సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది. ఇక మద్యం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో అందరికీ తెలిసిందే…అలాగే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టుకుని అప్పులు కూడా తెచ్చుకుంటుంది. ఇలా జగన్ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది.

ఇక తాజాగా సినిమా టిక్కెట్లు అమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అంశంపై ఎప్పటినుంచో ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని పేర్కొంటూ సినిమాటోగ్రఫీ చట్టంలో చేసిన సవరణలకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. అలాగే రోజుకు నాలుగు షోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అంటే ఎడాపెడా బినిఫిట్ షోలు వేయడం…రోజుకు ఆరేడు షోలు వేసుకోవడం కుదరదు. అలాగే టిక్కెట్ రేట్లని ఇష్టమొచ్చినట్లు పెంచడానికి లేదు.

ప్రభుత్వం ఏ ధర అయితే నిర్ణయించిందో అదే ధరకు టిక్కెట్లు అమ్మాలి. ఏదో పెద్ద సినిమాలు వచ్చాయని చెప్పి, మొదటి రోజు ఎక్కువ రేట్లు అమ్మడానికి గానీ, ఎక్కువ షోలు వేయడానికి అవకాశం లేదు. అయితే ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. పెద్ద బడ్జెట్ సినిమాలకు..బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు పెంచకపోతే…వారు పెట్టిన ఖర్చు తిరిగిరాదు. అలాంటప్పుడు సినిమాలు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఇప్పటికే పెద్ద సినిమలు రెడీగా ఉన్నాయి. అఖండ, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ లాంటి సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో…బడా హీరోలకు షాక్ ఇచ్చినట్లైంది. అలాగే ప్రభుత్వం చేతుల్లోకి సినీ పరిశ్రమ వచ్చిందనే చెప్పొచ్చు. దీనిపై సినీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. అసలు బయట నిత్యవసరాలు..ఇంకా అనేక రకాలుగా ట్యాక్స్‌లు ధరలు పెంచి ప్రభుత్వం ప్రజలపై భారం వేస్తుందని, ఇప్పుడు ఏదో సినిమా టిక్కెట్ల విషయంలో ఉద్దరిస్తున్నట్లు చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు.

సినిమా రంగానికి పెద్ద దిక్కుగా చిరంజీవి, నాగార్జునలు జగన్‌తో పలుమార్లు భేటీ అయ్యి, చేసిన పని ఇదేనా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంలో వారిద్దరు బాధ్యతలు తీసుకుని, ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా చేయకపోతే సినీ పరిశ్రమ నష్టపోవడం ఖాయమని అంటున్నారు.

Discussion about this post