ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్….అద్భుతమైన మెజారిటీతో గెలిచి సిఎం అయ్యారు. అయితే అలా గెలిచాక జగన్ ఎంత అద్భుతంగా పాలిస్తారో అని జనాలు అనుకున్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపిస్తారని భావించారు. కానీ జగన్ అలాగే చేస్తున్నారా? అంటే ఆ విషయం డైరక్ట్‌గా జనాలని అడిగితేనే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జగనన్న పాలన ఎలా ఉందో జనాలకు బాగా అర్ధమైందనే చెప్పొచ్చు.

జగన్ అధికారంలోకి వచ్చాక….సమయానికి పథకాలు ఇస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ పథకం పేరుతో రూపాయి ప్రజలకు ఇచ్చి….పది రూపాయిలు అదే ప్రజల దగ్గర నుంచి లాగేస్తున్నారు. పన్నుల రూపంలో ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. పథకాలు కొంతమందికే వస్తాయి.. కానీ పన్నులు భారం అందరిపైన పడింది. అది ఇది అనే తేడా లేకుండా ప్రతి దానిపై పన్ను వేసేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇసుక, వైన్స్, చెత్త పన్ను, ఇంటి పన్ను…ఇలా చెప్పుకుంటూ పోతే అనేకరకాలుగా ప్రజలపై భారం మోపారు. ఇక నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయో కూడా చెప్పాల్సిన పని లేదు. అభివృద్ది ఏమో శూన్యం.

అయితే దీనికి అడ్డు అదుపు కూడా ఏమి లేనట్లు కనిపిస్తోంది. ఇటీవల ప్రజలకు జగనన్న కరెంట్ షాకులు ఇస్తున్నారు. ఎక్కడైనా కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ తగులుతుంది. కానీ జగన్ ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు పట్టుకుంటే కరెంట్ షాక్ తగులుతుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇటీవల ట్రూ అప్ ఛార్జీల పేరిట బాదుడే బాదుడు. గత నెలలో జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నెల నెలకు ట్రూ అప్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రజలపై భారం వేసేస్తున్నారు. మరి ఈ కరెంట్ షాకుల నుంచి ప్రజలు ఎప్పుడు బయటపడతారో చూడాలి.

Discussion about this post