పేదవాడు ఆనందంగా ఉండటం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నామని, పేదవాడు కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ బాగానే చెప్పుకుంటారు. అయితే పైకి పేదవాడు కోసమని చెబుతూ..అదే పేదవాడు దగ్గర నుంచి డబ్బులు రివర్స్‌లో లాగేయడంలో జగన్ ప్రభుత్వాన్ని మించింది లేదనే చెప్పొచ్చు. ప్రతిదీ పేదవాడు కోసమే అన్నట్లు చెబుతారు గానీ..అందులో చాలా జిమ్మిక్కులు ఉంటాయి.

అసలు పేద, మధ్య తరగతి ప్రజల కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అంటారు…కానీ ఆ పథకాల్లో చాలా లొసుగులు ఉంటాయి. ఇంతవరకు జగన్ అమలు చేసిన ప్రతి పథకంలోనూ ఇలాంటి లొసుగులు ఎక్కువే. పైగా వాటిల్లో లొసుగులు ఉన్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే…అదిగో పేదవాడికి మంచి చేద్దామని అనుకుంటే..చేయకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో విరుచుకుపడతారు.

అలాగే పేదలపై ధరల భారం, పన్నుల భారం పెంచి సంక్షేమ పథకాల పేరిట ఇచ్చిన డబ్బులని రెట్టింపు వచ్చేలా చేస్తారు. మళ్ళీ పేదవాడు కోసమే తమ ప్రభుత్వమని అంటారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి…పేదవాడికి కావల్సిన ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఇక అవేమీ తగ్గించే పనిపెట్టుకోరు కానీ…పేదవాడు కోసం సినిమా టిక్కెట్ల ధరలు మాత్రం తగ్గిస్తామని మాట్లాడతారు.

ఇక ఎప్పుడో ఎన్టీఆర్, వైఎస్సార్ టైమ్‌లో కట్టించిన ఇళ్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెప్పి..అదే పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలని మరోసారి జగనన్న టౌన్‌షిప్ పథకం పేరుతో దోచుకునేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టింది.

పైగా పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరల్లోనే ప్లాట్లు ఇస్తామని చెబుతున్నారు. కానీ బయట రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చే ప్లాట్లు కంటే ప్రభుత్వం ఇచ్చే ఫ్లాట్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు మంగళగిరి సమీపంలోని నవులూరులో ఉన్న ప్రభుత్వ లేఔట్‌లో గజం ధర రూ.17,500గా నిర్ణయించారు. ఇదే నవులూరులో రాజధాని రైతులు ఇచ్చిన పూలింగ్ లేఔట్లలో చదరపు గజం రూ.10వేలు పలుకుతోంది. అంటే ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా జగన్ ప్రభుత్వం స్మార్ట్ బిజినెస్ చేస్తూ, పేద, మధ్య తరగతి ప్రజలని ఇంకా దోపిడి చేస్తుంది.

Discussion about this post