ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ బాగా జరుగుతున్నాయని చెప్పొచ్చు….సాధారణంగా రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి..కానీ ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక రివెంజ్ తప్ప మరొక కార్యక్రమం చేస్తున్నట్లే కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ రివెంజ్ కనిపిస్తుందనే చెప్పాలి. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు, కార్యకర్తలకు చుక్కలు కనబడుతున్న విషయం తెలిసిందే. ఏ రేంజ్‌లో టీడీపీ వాళ్ళకు చుక్కలు చూపించారో చెప్పాల్సిన పని లేదు.

అయితే జగన్ ప్రభుత్వం తమ మాట విని ఏ వర్గాన్ని కూడా వదలలేదు. అందుకే అనుకుంటా తమని పట్టించుకోకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎక్కువ సఖ్యతగా ఉంటున్న సినిమా వాళ్లపై సైతం రివెంజ్‌కు ప్లాన్ చేసి…అందులో భాగంగా సినిమా టిక్కెట్ల రేట్లు దారుణంగా తగ్గించి..చివరికి వారిని తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నారు. అసలు విచిత్రం ఏంటంటే…సినిమా టిక్కెట్లకు సంబంధించి సమస్య సృష్టించిందే జగన్ ప్రభుత్వం…పైగా సినీ పెద్దలని తమ వద్దకు రప్పించి…మళ్ళీ ఆ సమస్యకు ఏదో పరిష్కారం చూపించినట్లు కలరింగ్ ఇచ్చారు.

అదే చంద్రబాబు అధికారంలో ఉంటే సినిమా వాళ్ళకు ఈ తిప్పలు ఉండేవి కాదని, వారు అడగకుండానే బాబు అన్నీ కోరికలు తీర్చేవారని, కానీ జగన్ మాత్రం సమస్య సృష్టించి సినిమా వాళ్ళని ఆడుకుంటున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

పైగా పెద్ద పెద్ద స్టార్స్ వస్తే..వారికి సరైన గౌరవం కూడా ఇవ్వలేదని, పైగా బయట ఎండలో ప్రెస్ మీట్ పెట్టించారని, అది కూడా స్టార్ హీరోలని నిలబెట్టించారని ఆయా హీరోల అభిమానులు ఫైర్ అవుతున్నారు. పోనీ స్టార్స్ వచ్చినందుకైనా సమస్య పరిష్కారం అయిందా? అంటే అది కనబడటం లేదు. ఐదు షోలకు పర్మిషన్ దొరికింది గాని, సినిమా టిక్కెట్ల రేట్లపై మాత్రం క్లారిటీ రాలేదు. మొత్తానికి జగన్ ప్రభుత్వం స్టార్ హీరోలని తమ దగ్గరకు రప్పించి, వారికే చుక్కలు చూపించిందని చెప్పొచ్చు.

Discussion about this post