పెట్రోల్, డీజిల్ ధరల అంశంలో ఏపీలోని జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల దాడి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించిన విషయం తెలిసిందే. ఇక కేంద్రం కాస్త ఊరటనిస్తే, మరికొన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాయి. కానీ ఏపీలో అధికంగా సుంకం వసూలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మాత్రం…దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. చుట్టుపక్కల రాష్ట్రాలు సుంకాన్ని తగ్గిస్తుంటే..జగన్ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది.

అసలే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి…ప్రజలపై వేసిన భారం తగ్గిస్తే..మళ్ళీ ఇబ్బందులు పడాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పెట్రోల్, డీజిల్ సుంకం ఎక్కువగా ఉండటం వల్ల ఏపీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల రవాణా చార్జీలు పెరిగిపోవడంతో అన్నీ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలపై ఆర్ధిక భారం పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో పెట్రోల్, డీజిల్‌లపై సుంకం తగ్గించి…ప్రజలపై భారం తగ్గించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పనిచేయడం లేదు.

దీంతో ప్రతిపక్ష టీడీపీ జగన్ ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టింది. ఏపీలో ఇప్పుడు లీటరు పెట్రోల్ దాదాపు రూ.110 ఉండగా, డీజిల్ రూ. 97 ఉంది. పొరుగునే ఉన్న బెంగళూరులో మన కంటే పెట్రోలు రూ.పది.. డీజిల్ రూ. పన్నెండు తక్కువగా ఉంది. ఇదే అంశాన్ని చంద్రబాబు సైతం చెబుతూ…వెంటనే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో బాదుడే బాదుడు అని హడావిడి చేసిన జగన్…ఇప్పుడు ఇంత బాదుతూ సైలెంట్‌గా ఉంటున్నారని ఫైర్ అవుతున్నారు. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోలు రూ. 16, డీజిల్ రూ.17 ఎక్కువకు అమ్ముతున్నారని, వెంటనే ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు బీజీపే సైతం ఏపీలో పోరాటం చేస్తుంది. అన్నివైపులా నుంచి జగన్‌పై ఎటాక్ పెరిగింది…ఇంకా ప్రజలు కూడా ఎదురుతిరగకముందే జగన్…పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే బెటర్.

Discussion about this post