క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన ప్రాంతీయ పార్టీల్లో ఏపీ అధికార పార్టీ.. వైసీపీ చాలా ముందుంది. ఎ క్కడా కూడా పార్టీలో ఎంత పెద్ద నాయకుడు అయినా.. అధినేత గీసిన గీత దాటకపోవడంతోపాటు.. పార్టీ లైన్‌ను ఎట్టిపరిస్థితిలోనూ అతిక్రమించే పనిచేయరు. అంతెందుకు ఇటీవల మంత్రి పదవులు దక్కనివా రు కూడా.. కొంత ఉక్కిరిబిక్కిరి గురైనా.. తర్వాత లైన్‌లోకి వచ్చారు. ఇదీ.. వైసీపీలో ఇప్పటి వరకు ఉన్న క్రమశిక్షణ! కానీ, రేపు ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? ఇదీ..ఇప్పుడు టెన్షన్, టెన్షన్‌గా మారింది.

దీనికి కారణం.. బుధవారం.. సీఎం జగన్.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్లు, సమన్వయ కర్తలు.. ఇలా అందరితోనూ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా.. ఆయన వచ్చే నెల నుంచి ప్రారంభించ నున్న ఇంటింటికీ వైసీపీ కార్యక్రమానికి సంబంధించి.. దిశానిర్దేశం చేస్తారు. ప్రజలకు ఏం చెప్పాలి? వారి నుంచి ఎదురయ్యే సమస్యలను అక్కడ ఎలా పరిష్కరించాలి? పార్టీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? వంటి అనేక సమస్యలపై ఆయన మాట్లాడనున్నారు.

అయితే.. దీనికి ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు డుమ్మా కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అంతర్గతంగా గట్టి ఆదేశాలే జారీ చేశారని తెలిసింది. ఇలా ఎందుకు వ్యతిరేకత పెరిగింది? అనే విష యాన్ని పరిశీలిస్తే.. ఇటీవల జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన. శాసనసభా పక్ష సమావేశంలో వచ్చే ఉగాది(అయిపోయింది) నుంచి ప్రజలమధ్యే ఉండాలని.. అలా ఉన్నవారికి మాత్రమే టికెట్లు ఇస్తా మని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు… మీరు ప్రజల్లో తిరుగుతున్నా.. మార్కులు వేస్తామని.. దానిని బట్టే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు.

దీంతో ప్రజా ప్రతినిధుల్లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలోనే.. అసలు టికెట్ ఇస్తారో.. ఇవ్వరో కూడా తేల కుండా.. ఎలా వెళ్లాలి? ఏ విధంగా ముందుకు సాగాలి? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని అంటే.. ముందు తమకు టికెట్ ఇస్తారో లేదో చూసుకున్నాకే కన్ఫర్మ్ చేసుకున్నాకే.. వెళ్లాలని.. నిర్ణయించుకున్నారట. దీంతో రేపు జరగనున్న సమావేశం అత్యంత హాట్ హాట్‌గా మారిందని అంటున్నారు పార్టీ నాయకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post