జగన్ కోట బద్దలవుతుంది. ఇన్నేళ్లు తమకు తిరుగులేదనే కంచుకోట కడపలో వైసీపీకి సీన్ రివర్స్ అవుతుంది. అనూహ్యంగా లోకేష్ పాదయాత్రతో టిడిపి పుంజుకుంటుంది. వైసీపీకి టెన్షన్ పెరిగింది. అయితే లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ లోకేష్ ముందుకెళుతున్నారు. ప్రజా సమస్యలు వింటున్నారు..సెపరేట్ గా వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అయితే రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇక కడపలో లోకేష్ పాదయాత్రకు ఎలాంటి స్పందన వస్తుందని అంతా టెన్షన్ పడ్డారు. కానీ ఊహించని విధంగా చిత్తూరు, అనంతపురం,కర్నూలు జిల్లాల కంటే మిన్నగా కడపలో ప్రజలు లోకేష్ పాదయాత్రకు మద్ధతు తెలుపుతున్నారు. ఈ స్థాయిలో మద్ధతు వస్తుందని వైసీపీ కూడా ఊహించి ఉండదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం ఇలా ప్రతి చోటా ఊహించని మద్ధతు వచ్చింది. దీంతో టిడిపి శ్రేణుల్లో జోష్ పెరిగింది.

దీంతో ఈ సారి ఎన్నికల్లో కడపలో మంచి ఫలితాలు వస్తాయని తెలుగు తమ్ముళ్ళు ఆశిస్తున్నారు. గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టిడిపికి మంచి ఫలితాలు రావడం లేదు. ఏదో ఒకటి అర సీటు గెలుచుకోవడం తప్ప కడపలో టిడిపి సత్తా చాటడం లేదు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. అనూహ్యంగా టిడిపికి బలం పెరుగుతుంది. లోకేష్ పాదయాత్ర మరింత ఊపు తెస్తుంది.
ఈ సారి జిల్లాలో టిడిపి 4-5 సీట్లు గెలుచుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే 3 సీట్లలో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది. ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరు స్థానాల్లో పార్టీకి పట్టు ఉంది. ఇక కమలాపురం, జమ్మలమడుగురులో బలపడుతూ ఉంది. మొత్తానికి జగన్ కోట ఈ సారి బద్దలయ్యేలా ఉంది.